Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్

వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ కండిషన్ కూడా అరుదుగా కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఆల్కహాల్ తీసుకునే సమయంలో సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం. ఈ అలవాటు కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం.

Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్

Liver

Liver Cancer : మన శరీరం లోపలి అవయవాలలో అతి పెద్దదైన అవయవం కాలేయం. మానవ శరీరంలో పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం కూడా ఇదే. ఇది దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. విషతుల్యమైన పదార్థాలు, కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వలన కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురై హెపటైటిస్ కు దారితీస్తాయి. హెపటైటిస్ కు దారితీసే వైరస్ లను ఎ,బి,సి,డి,ఇ లు గా వర్గీకరించారు. వీటిలో బి,సిలు చాలా ప్రమాదకరమైనవి.

మద్యంతో కాలేయవాపు తలెత్తుతుంది. ఇందులో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి వాపుప్రక్రియకు దారితీస్తుంది. ఇది క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేస్తుంది. మద్యం తాగనివారిలోనూ కాలేయంలో కొవ్వు పేరుకుపోవచ్చు. ఊబకాయంతోనూ కాలేయ క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. కాలేయ క్యాన్సర్‌ విషయంలో తొలిదశలో చాలా మందిలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించవు. కడుపులో నొప్పి, బరువు తగ్గడం, కామెర్లు, పొట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు క్యాన్సర్ దశలో కనిపిస్తాయి. వివిధ రకాల పరీక్షల ద్వారా లివర్ క్యాన్సర్ దశను ముందుగానే తెలుసుకోవచ్చు.

లివర్ క్యాన్సర్ బాధితుల్లో కాలేయం పనితీరు పూర్తిగా మందగిస్తే దాన్ని మళ్లీ పనిచేసేలా చేయడం కష్టంగా మారుతుంది. అలాంటి వారిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అవసరమౌతుంది. కాలేయంలో గడ్డల సంఖ్య, వాటి పరిమాణం వంటి అనేక అంశాలు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను నిర్ధేసిస్తాయి. అవసరాన్ని బట్టి వైద్యులు కాలేయమార్పిడి చికిత్సనందిస్తారు. కాలేయ క్యాన్సర్ హెపటైటిస్-బి లేదా సీ వైరస్ కారణంగా వస్తే అందుకు అవసరమైన మందులను వాడుతూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ కండిషన్ కూడా అరుదుగా కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఆల్కహాల్ తీసుకునే సమయంలో సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం. ఈ అలవాటు కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. స్థూలకాయం, అనువంశికంగా వచ్చే పొట్ట వంటి ఒబేసిటీ కాలేయ క్యాన్సర్‌కు ఒక కారణం. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్‌సీసీ తరహా క్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ. కాలేయ క్యాన్సర్‌ను ముందే కనుగొంటే మరణాన్ని తప్పించుకోడానికి ఉండే అవకాశాలు 80 శాతం కంటే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మంచి జీవనశైలి. అంటే సమయానికి సమతుల ఆహారం, శరీరానికి తగిన వ్యాయాయం. బరువు పెరగకుండా అదుపులో పెట్టుకోవడం. పొగతాగడాన్ని పూర్తిగా మానేయడం, ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా వదిలేయడం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పునుండి తప్పించుకోవచ్చు.