Weight Loss: ఆపిల్ సైడర్ వెనిగర్ తో బరువు తగ్గుతారా?.. నిజమెంత?

అధిక బరువు అనేది ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సంగతి తెలిసిందే. శరీరం బరువు వ్యక్తి యొక్క ఎత్తుకు అనుగుణంగా ఉండాల్సి ఉండగా.. ఎత్తుకి ఏమాత్రం సంబంధం లేకుండా అసాధారణ రీతిలో బరువు పెరిగితే దాన్ని స్థూలకాయం, ఊబకాయం అంటారు.

Weight Loss: ఆపిల్ సైడర్ వెనిగర్ తో బరువు తగ్గుతారా?.. నిజమెంత?

Weight Loss

Weight Loss: అధిక బరువు అనేది ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సంగతి తెలిసిందే. శరీరం బరువు వ్యక్తి యొక్క ఎత్తుకు అనుగుణంగా ఉండాల్సి ఉండగా.. ఎత్తుకి ఏమాత్రం సంబంధం లేకుండా అసాధారణ రీతిలో బరువు పెరిగితే దాన్ని స్థూలకాయం, ఊబకాయం అంటారు. శరీరంలో కొవ్వు నిక్షేపణలు అధికంగా ఉన్నప్పుడు సంభవించే పరిస్థితి కాగా.. దీన్ని తగ్గించుకునేందుకు చాలామంది రకరకాల డైట్లు పాటిస్తూ.. రోజువారీ ఆహార విధానంలో మార్పులు చేసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Weight Loss

Weight Loss

అలాంటి వారికి ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV) సహాయపడుతుందా అన్నదానిపై చాలామందిలో రకరకాల అనుమానాలున్నాయి. ఆరోగ్య కోచ్ లూక్ కౌటిన్ ఇచ్చిన దీనిపై సమగ్ర వివరణ ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని.. అయితే.. ఏసీవీ బరువును తగ్గించదని.. బరువు తగ్గేందుకు సహాయపడుతుందని వివరించారు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గడంలో సహాయపడుతుందని వివరించారు.

Weight Loss

Weight Loss

కడుపులో ఆమ్ల స్థాయి తక్కువగా ఉన్నవారికి.. జీర్ణక్రియ, ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడం వంటి సమస్యలకు దారితీస్తాయని.. అలాంటి వారికి ఈ ఏసీవీ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఏసీవీని ఉపయోగిస్తే జీర్ణక్రియకు సహాయపడే కడుపు ఆమ్లాల ఉత్పత్తిని ఉత్తేజపరిచేందుకు ఇది సహాయపడుతుందని లూకా చెప్పారు. అయితే, ఇప్పటికే జీర్ణక్రియతో సమస్యలు ఉన్నవారికి ఏసీవీ వాస్తవానికి దాన్ని మరింత దిగజార్చుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.

Weight Loss

Weight Loss

ఏసీవీ అందరికీ ఒకేవిధంగా సరిపోవాలని రూల్ ఏమి లేదన్న లూకా భోజనానికి 45 నిమిషాల ముందు లేదా తరువాత ఏసీవీని తీసుకుంటే ఉబ్బరం తగ్గుతుందని.. ఆమ్లత్వంపై ఏసీవీ ప్రభావం గురించి మాట్లాడుతూ, ఇది కొన్నింటిలో లక్షణాలను మెరుగుపరుస్తుండగా, ఇతరులలో పరిస్థితిని మరింత దిగజార్చుతుందని అన్నారు. ఇక, రక్తంలో చక్కెర, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడానికి మాత్రం ఏసీవీ సహాయపడుతుందని చూపించే అధ్యయనాలు ఉన్నాయన్న లూక్ ముందుగా ఏసీవీ మీకు సరిపోతుందా లేదా అన్నది తేల్చుకున్నాకే వినియోగించడం మంచిదని చెప్పారు.