Losing weight : ఇలా చేస్తే బరువు తగ్గటం సులభం!

భోజనానికి ముందు నారింజలాంటి నిమ్మజాతి పండుతింటే బరువు తగ్గుతారని పలు పరిశోధనల్లో తేలింది. వారంలో మూడు రోజలు గుడ్లు , ఒకపూట చేప తినడం వల్ల బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Losing weight : ఇలా చేస్తే బరువు తగ్గటం సులభం!

Losing Weight

Losing weight : అధిక బరువుతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఏమాత్రం ఫలితం ఉండదు. ఇందు కారణం లేకపోలేదు. బరువు తగ్గే ప్రయత్నించటం ప్రణాళికా బద్దంగా లేకపోవటమే. బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని సూత్రాలు పాటించటం మంచిది. దీంతో ఎక్కువ రిస్క్ తీసుకోకుండానే బరువను ఈజీగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

పోషకాహార నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం బరువు తగ్గాలనుకునే వారు వారానికి ఒకరోజు అన్నిపూటలా భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలు , సలాడ్ లు తీసుకోవటం ఉత్తమం. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరల్లోని పోషకాలతో బరువు తగ్గటం తోపాటు, చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. నిద్రలేచిన గంటలోపే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తినటం వల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది. ప్రతిరోజు పాల ఉత్పత్తులు ఎంతోకొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్సియం కొవ్వుని కొంతమేర తగ్గిస్తుంది.

ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ప్రశాంతంగా నిధానంగా భోజనం చేయాలి. ఆహారం తీసుకునే సమయంలో హాడాహుడి పనికిరాదు. ప్రశాంతంగా భోజనం చేయటం వల్ల త్వరగా జీర్ణమౌతుంది. చిన్నసైజు ప్లేటులో భోజనం చేయాలి. దీని వల్ల తక్కువ మొత్తంలో తినటం వల్ల శరీరానికి అందే కేలరీలను తగ్గించిన వారవుతారు. వ్యాయామం చేసిన తరువాత 30 నిమిషాల లోపు భోజనం చేయటం మంచిది. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయిన సందర్భంలో వెంటనే ఉపయోగించుకుంటుంది.

భోజనానికి ముందు నారింజలాంటి నిమ్మజాతి పండుతింటే బరువు తగ్గుతారని పలు పరిశోధనల్లో తేలింది. వారంలో మూడు రోజలు గుడ్లు , ఒకపూట చేప తినడం వల్ల బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. భోజనానికి ముందు సూప్స్ తాగితే శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. అంతేకాకుండా మంచి శరీర అకృతి పొందవచ్చు. మిరియాలు, మిర్చిలను ఆహారంలో తగు మోతాదుల్లో వాడటం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.