Jaggery : వేసవిలో రోజుకో బెల్లం ముక్క తింటే బోలెడు ప్రయోజనాలు!

బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్‌లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి, తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నమాట వాస్తవమే. అవి శరీరానికి మేలు చేస్తాయి.

Jaggery : వేసవిలో రోజుకో బెల్లం ముక్క తింటే బోలెడు ప్రయోజనాలు!

Jeggrery

Jaggery : చక్కెర కన్నా బెల్లం తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బెల్లం శరీర ఉష్ణోగ్రత ని నియంత్రణలో ఉంచుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో దీనిని తీసుకోవటం వల్ల శరీరంలోని అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కడుపులో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలను అధిగమించడానికి రోజూ ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు. బెల్లం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.

బెల్లంలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు, నాడీవ్యవస్థ పటిష్టమవుతాయి. మైగ్రెయిన్ తలనొప్పి బాధిస్తుంటే బెల్లం, నెయ్యి.. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు, జలుబు, ఆస్తమా.. లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందడంలోనూ బెల్లం చక్కగా పని చేస్తుంది. చర్మానికి మెరుపునిచ్చి, మొటిమలని నివారిస్తుంది.

బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్‌లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి, తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నమాట వాస్తవమే. అవి శరీరానికి మేలు చేస్తాయి. ఏదైనా సరే అతిగా తింటే అనార్థమే. డయబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా బెల్లానికి దూరంగా ఉండాలి. ఇది రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచే ప్రమాదం ఉంది. ప్రతి 100 గ్రాముల బెల్లంలో 10-15 గ్రామాలు ఫ్రక్టోజ్ ఉంటుంది. దీన్ని రోజు తింటే.. బ్లడ్ సుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. ఎనర్జీ లెవల్స్ త్వరగా పెరిగేలా చేయటంలో బెల్లం ఉపకరిస్తుంది. రక్తహీనతను తొలగిస్తుంది. పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు దృఢంగా మారతాయి. రక్తపోటు, గుండె జబ్బులు దరిచేరవు. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. బెల్లంలో ఉండే అధిక స్ధాయి ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నెలసరి సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు కొన్ని కాకరకాయ ఆకులు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న బెల్లం ముక్క.. ఈ మూడింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ఒక వారం రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తరచుగా పొడి దగ్గు బాధిస్తున్నట్లయితే ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.