Health Benefits : దాల్చిన చెక్క, తేనెతో ఆరోగ్యప్రయోజనాలు బోలెడు!

చర్మంపై దురద, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క పొడి తీసుకొని అందులోకి వేడిచేసిన తేనె కలిపి చర్మానికి రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి.

Health Benefits : దాల్చిన చెక్క, తేనెతో ఆరోగ్యప్రయోజనాలు బోలెడు!

Cinnamon

Health Benefits : తేనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. దాల్చిన చెక్కలో ఇన్ల్ఫమేషన్ తగ్గించే గుణం, ఇమ్యునిటీని మెరుగుపరిచేందుకు దోహదపడుతంది. ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకోనే వారిలో ఎలాంటి రోగాలు దరిచేరవు. రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాల్చిన చెక్కలోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి. రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిడేషన్ ఫ్యాట్స్ అన్ని కూడా ఏజింగ్ కు కారణం అవుతాయి. ఇతర సమస్యలకు దారితీస్తాయి. వీటన్నింటిని తొలగించడంలో దాల్చిన చెక్క, తేనె కాంబినేషన్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

అరటీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ లో రెండు టీస్పూన్ల తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కండరాల వాపులు, కండరాల నొప్పులు, అలర్జీలు తగ్గుతాయి. దాల్చిన చెక్క, తేనెతో చేసిన డ్రింక్స్‌ శరీరంలోని మురికిని శుభ్రం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది. ఈ చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి దాల్చిన చెక్క పొడి బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడి లో కొద్దిగా తేనె కలిపి క్రమం తప్పకుండా రోజూ మూడుసార్లు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

చర్మంపై దురద, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క పొడి తీసుకొని అందులోకి వేడిచేసిన తేనె కలిపి చర్మానికి రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి. దాల్చినచెక్కపొడి, తేనెతో కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముఖంపై ఏర్పడ్డ కురుపులు, దద్దుర్లు,కాయలు వంటి పై రాసి 25 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి గాయం అయినా చోట రక్తం సరఫరా పెరిగి కురుపులు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. రెండు టేబుల్ స్పూన్లు దాల్చినచెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్లు తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు ఉన్నచోట రోజుకు రెండుసార్లు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు, గొంతు నొప్పి,మంట, గరగర వంటి సమస్యలు తొలగిపోతాయి.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటం జరిగింది. ఈ సమాచారం కేవలం అవగాహన కలిగించటం కోసం మాత్రమే. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.