Mustard : చలికాలంలో ఆవపిండి, ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..

వైద్యంలో, ఆవపిండిని ఔషద పదార్థంగా ఉపయోగిస్తారు. ఆవ పొడి, ఆవపిండి యొక్క కషాయాలను వివిధ రకాల ప్రాణాంతక నియోప్లాజమ్‌ల కోసం మౌఖికంగా తీసుకుంటారు.

Mustard : చలికాలంలో ఆవపిండి, ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..

Mustard Greens

Mustard : ఇంటి పోపు పెట్టేల్లో ఉండే అవాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఆవాలను వంటల్లో వినియోగించడమే కాకుండా.. ఆకులను ఆకుకూరలు వండుతారు. ఆవాల నుంచి నూనె కూడా తయారవుతుంది. ఇది ఔషధ గుణాలను కలిగి ఉండి అనేక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఆవపిండిలో విటమిన్లు, కాల్షియం మరియు ఐరన్ లవణాలు, విటమిన్ సి, కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ఆవాల వినియోగం మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది.

B మరియు P సమూహాల విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, పెరుగుదల పదార్థాలు. విత్తనాలలో స్టెరాయిడ్‌లు ఉన్నాయి. కొలెస్ట్రాల్, సపోనిన్స్, ఎసెన్షియల్, ఫ్యాటీ ఆయిల్, సినాల్‌బిన్ థియోగ్లైకోసైడ్ మొదలైనవి ఆవాల్లో ఉన్నాయి. ఆవాల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, మాంగనీసు, క్యాల్షియం అధికంగా లభిస్తాయి. ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని కాల్షియం ఎముకలకు, దంతాలకు బలాన్నిస్తాయి. ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి నాశనం చేస్తుంది. జలుబు, ఉబ్బసం, బ్రాంకైటిస్, నిమోనియాల్లో ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలు కూడా ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరం అని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు. తలనొప్పి, మైగ్రేన్‌ తలనొప్పులను తగ్గించడంలో గ్రేట్‌గా సాయపడుతుంది.

వైద్యంలో, ఆవపిండిని ఔషద పదార్థంగా ఉపయోగిస్తారు. ఆవ పొడి, ఆవపిండి యొక్క కషాయాలను వివిధ రకాల ప్రాణాంతక నియోప్లాజమ్‌ల కోసం మౌఖికంగా తీసుకుంటారు. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారం వల్ల కొలెస్ట్రాల్ పెరగుతుంది. శీతాకాలంలో ఖచ్చితంగా ఆహారంలో ఆవపిండిని చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు సెలవిస్తున్నారు. చలికాలంలో ఆవపిండి వినియోగంతో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే, గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.ఆవ ఆకులను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇందులో విటమిన్-ఏ పుష్కలంగా లభిస్తుంది. చలికాలంలో తప్పనిసరిగా ఆహారంలో ఆవపిండిని చేర్చుకోవడం వల్ల విటమిన్‌ ఏ శరీరానికి లభించి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

శ్వాసకోశ వ్యవస్థ వ్యాధులు,న్యుమోనియా, కొల్లాజెనోసెస్, కీళ్ల వ్యాధులు – కీళ్లనొప్పులు,జీర్ణవ్యవస్థ వ్యాధులు,అంటు వ్యాధులు, చెవి, ముక్కు మరియు గొంతు వ్యాధులు, ముక్కు కారటం, న్యూరోసైకియాట్రిక్ వ్యాధులు, నాడీ, సయాటిక్ నరాల న్యూరిటిస్, హిస్టీరియా, చర్మం, మచ్చలు వంటి వ్యాధులకు ఆవాలు, ఆవపిండి, ఆవ ఆకులను ఉపయోగిస్తారు. ఆవాలు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్‌ రాకుండా ఉండేందుకు నిత్యం ఆవాలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

గర్భిణీల్లో ఐరన్ లోపం సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు ఎల్లప్పుడూ సూచిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఆవ ఆకులను సలాడ్ లలో వినియోగిస్తున్నారు. వీటి వినియోగంతో ఇనుము లోపం తొలగిపోతుంది. గర్భిణీలు రోజూ ఆవాలు తీసుకోవడం ద్వారా కూడా ఐరన్‌ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఆవ ఆకులు వాపు నిరోధకంగా పనిచేస్తాయి. తాజా ఆకుల్లో విటమిన్ కె, ఫ్యాటీ అమైనో అమ్లాలు , ఓమేగా 3 ఉంటాయి. కణాలు, కణజాలం వాపును తగ్గించటంలో బాగా పనిచేస్తాయి.

ఇదిలా వుంటే ఆవాల పిండి, ఆకులు అతిగా వినియోగించటం అంత మంచిదికాదు. వీటి వినియోగం అధికంగా ఉంటే దుష్పప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణ వ్యవస్ధపై ప్రభావాన్ని చూపిస్తుంది. కడుపులో మంటకు దారి తీస్తుంది. శరీరంలో ఇతరరత్రా సమస్యలు ఉన్నవారు వీటిని వినియోగించకుండా ఉండటమే ఉత్తమం. కొన్ని సందర్భాల్లో చర్మ సంబంధమైన ఎలర్జీలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. వేడి ప్రాంతాల వాసులు ఆవ పిండిని వాడకపోవటమే మంచిది.