Lotus Nuts : హై బీపీ నియంత్రించి, బరువు తగ్గేలా చేసే తామర గింజలు!

సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బీపీ రోగులు రోజు ఆహారంలో తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఆహారంలో కొన్నితీసుకోవటం మంచిది.

Lotus Nuts : హై బీపీ నియంత్రించి, బరువు తగ్గేలా చేసే తామర గింజలు!

Lotus Seeds

Lotus Nuts : తామరపువ్వు నుంచి వచ్చే గింజలను తామర గింజలు అంటారు. ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని పిలువబడే ఈ గింజల్లో అద్భుతమైన పోషక విలువలు వున్నాయి. తామర గింజలు అంటే చాలామందికి తెలియదు అయితే వీటిని పూల్ మఖని అని కూడా పిలుస్తారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్ అని పిలుస్తుంటారు. ఈ గింజలు తామర పువ్వుల నుండి వస్తాయి. వీటిలో అనేక పోషకాలు ఉన్నాయి.

వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, బి1, బి2, బి3 విటమిన్లు, ఫొలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ మొదలైనవి వున్నాయి. ఆయుర్వేదంలోనూ వీటిని వాడుతారు. వీటిలో అధిక కెలోరీలు, చెడుకొవ్వులు ఏమాత్రం ఉండవు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇవి దివ్యౌషధం. ఉత్తర భారతదేశంలో వీటితో స్వీట్స్ కూడా తయారుచేసుకుంటారు. తామర గింజలు ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారంగా ఉపయోగపడుతుంది.

ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌ను దరిచేరకుండా చేస్తాయి. గింజల్లోని నెఫెరిన్‌ అనే పదార్థానికి క్యాన్సర్‌ను నిర్మూలించే శక్తి ఉందని అధ్యయనంలో తేలింది. ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు చాలా దోహదపడుతుంది. వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన దీనిని ఆహారంగా తీసుకుంటే బీపీని నివారించవచ్చును. గర్భిణుల, బాలింతలు వీటిని తీసుకుంటే నీరసం దరిచేదరు. రక్తహీనత గల రోగులకు ఇది ఒక మందుగా పనిచేస్తుంది. ఈ తామర గింజలు ఆకలిని పెంచేందుకు సహాయపడుతాయి. గింజల్లోని సంక్లిష్ట పిండిపదార్థాలూ పాలీఫినాల్సూ బీపీ, పిత్తాశయ రాళ్లూ, మధుమేహమూ మంటా తగ్గడానికి తోడ్పడతాయి.

సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బీపీ రోగులు రోజు ఆహారంలో తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఆహారంలో కొన్నితీసుకోవటం మంచిది. ఆకలి పెంచడమే కాకుండా డయేరియాను నివారించటంలో దోహదపడతాయి. అయితే ఈ గింజలు కొంతమందికి సరిపడక ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి. ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కుగా ఉంటుంది. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు. మృదువైన చర్మసౌందర్యంకోసం లినోలిక్‌ ఆమ్లం, ప్రొటీన్లూ ఇతరత్రా పదార్థాలూ ఉండే పద్మదళాలను ఫేషియల్‌ క్రీముల తయారీలో వాడతారు.