Breast Cancer : రొమ్ములు, చంకల వద్ద గడ్డల తో కూడిన నొప్పా? రొమ్ము క్యాన్సర్ గా అనుమానించాల్సిందేనా?

రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు కొన్ని రోజుల తర్వాత రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం అలవాటు చేసుకోవాలి. మహిళలు తమ రొమ్ముల ఆకారం మరియు పరిమాణం ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

Breast Cancer : రొమ్ములు, చంకల వద్ద గడ్డల తో కూడిన నొప్పా? రొమ్ము క్యాన్సర్ గా అనుమానించాల్సిందేనా?

Breast Cancer

Breast Cancer : ఇటీవలి కాలంలో రొమ్ము క్యాన్సర్ కేసులు బాగా పెరుగుతున్నాయి. భారతదేశంలో సగటున 28 మంది మహిళల్లో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యువుల్లో లోపం కొన్ని సార్లు కారణమైతే, పెద్ద వయస్సు మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అలాగే జీవనశైలిలో వేగవంతమైన మార్పుల కారణంగా రొమ్ము క్యాన్సర్ ఘటనలు పెరుగుతున్నాయి. ఊబకాయం ,అధిక బరువు ఉన్న వారిలో రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వు కలిగిన ఆహారం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొవ్వు కణితి పెరుగుదలకు ఇంధనంగా ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ ను ప్రేరేపిస్తుంది. పొగాకు,మద్యం సేవించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రోమ్ము క్యాన్సర్ గుర్తించటం ఎలా?

రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు కొన్ని రోజుల తర్వాత రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం అలవాటు చేసుకోవాలి. మహిళలు తమ రొమ్ముల ఆకారం మరియు పరిమాణం ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. చంక ప్రాంతం నుండి పక్కటెముక ప్రాంతం వరకు రొమ్ములు సాధారణ రూపంలో ఉన్నాయా లేదటే రూపం మారిందా చూసుకోవటం మంచిది. చనుమొన ప్రాంతాలలో, చంకల దగ్గర ఏదైనా గడ్డలు ఉన్నాయా, నొప్పి ఉందా అన్న విషయం గమనించాలి. ఏమాత్రం సందేహం ఉన్నా ధృవీకరించుకునేందుకు రొమ్ము కణజాలంలో మార్పులను చూడడానికి తక్కువ-మోతాదు ఎక్స్-కిరణాలను ఉపయోగించే ప్రక్రియ మామోగ్రామ్‌ చేయించుకోవాలి. ఏదైనా నొప్పి లేదా గడ్డ ఏర్పడినట్లయితే, మహిళలు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

రొమ్ము క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు ;

1. రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి తల్లిపాలు ఉత్తమ మార్గం. అలాగే తల్లిపాలు బిడ్డకు మంచిదని తెలుసుకుని, పాలిచ్చే ప్రతి మహిళకూ మేలు జరుగుతుందని తెలుసుకోవాలి.

2. అధిక స్థాయిలో రేడియేషన్, పర్యావరణ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఎక్కవ సమయంలో ఉండటం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల రొమ్ము క్యాన్సరే కాదు ఇతరత్రా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

3. జీవనశైలి మార్పులు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. వారంలో ఎక్కువ రోజులు కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయటం అలవాటుగా మార్చుకోవాలి.

4. సమతుల్యమైన మరియు తక్కువ కేలరీల ఆహారం తీసుకోవటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినటం కన్నా ఇంట్లో చేసే ఆహారం ఆరోగ్యానికి చాల మంచిది.

5. ఆహారంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉపిరితిత్తులకు వ్యాపిస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది.

6.అధిక ఫైబర్ ఆహారాలు తినడం, ముఖ్యంగా పండ్లు మరియు కూరగాయలు, రక్తంలో అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గించడం ద్వారా రొమ్ము కాన్సర్ నివారణకు గణనీయంగా సహాయపడతాయి.

7.ఒమేగా -3, కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు బ్రెస్ట్ కాన్సర్ నివారణకు సహాయపడతాయి.