Lunar Eclipse 2021: ఈరోజే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా చూడొచ్చు?

అంతరిక్షంలో అద్భుతం జరుగబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం 2021, మే 26న బుధవారం కనువిందు చేయనుంది. ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు.

Lunar Eclipse 2021: ఈరోజే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా చూడొచ్చు?

Lunar Eclipse 2021 (1)

Lunar Eclipse 2021: అంతరిక్షంలో అద్భుతం జరుగబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం 2021, మే 26న బుధవారం కనువిందు చేయనుంది. ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మొత్తం, ఓషియానియా, అలస్కా, కెనడా, అమెరికాలో ఎక్కువ భాగం హవాయి అన్ని ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.



మెక్సికో, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో చాలా భాగం భారతదేశంలోనూ ఈ చంద్ర గ్రహణం బాగా కనిపిస్తుంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప కాలం పాటు పాక్షికంగా కనిపిస్తుంది.

ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ (Blood Moon)అని పిలుస్తారు. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తాడు. సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగుతో కిరణాలు భూమిమీద పడతాయి. అలా వచ్చిన కాంతి కిరణాలు చంద్రునిపై పడతాయి. అప్పుడు చంద్రుడి రంగు మారిపోతుంది. అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణంగా మారుతుంది. 2019 జనవరి 21న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తోంది.



చంద్ర గ్రహణం తేదీ, సమయం ఏంటి?
సంపూర్ణ చంద్ర గ్రహణం లేదా చంద్ర గ్రహన్ మే 26 బుధవారం జరుగుతుంది. జనవరి 2019 చంద్ర గ్రహణం తరువాత మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం. పెనంబ్రల్ ఎక్లిప్స్ వద్ద మే 26న ఉదయం 08:47:39 (UTC)కు మొదలై.. 13:49:44 (UTC) వద్ద ముగుస్తుంది.

భారత్‌లో చంద్రగ్రహణ సమయం :
భారతదేశంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. మే 26, 2021న సూర్యోదయం తరువాత, గ్రహణం పాక్షిక దశ కనిపిస్తుంది. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో (సిక్కిం మినహా), పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. గ్రహణం పాక్షిక దశ మధ్యాహ్నం 3:15 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. సంపూర్ణ దశ సాయంత్రం 4:39 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. సంపూర్ణ దశ సాయంత్రం 4:58 గంటలకు (IST), పాక్షిక దశ సాయంత్రం 6:23 గంటలకు (IST) ముగుస్తుంది.



గ్రహణాన్ని ఎవరు చూడగలరు?
ఆస్ట్రేలియాలో, పశ్చిమ అమెరికా, పశ్చిమ దక్షిణ అమెరికా, లేదా ఆగ్నేయ ఆసియాలో నివసిస్తున్న వారు సూపర్ ఫ్లవర్ పౌర్ణమిని పూర్తిగా గ్రహణం చూడవచ్చు. ఈ మొత్తం చంద్ర గ్రహణం సమయంలో వాతావరణంలో 14 నిమిషాల పాటు ఎరుపు నీడగా మారుతుంది.

చంద్ర గ్రహణం పరిమాణం ఎంతంటే?:
చంద్రగ్రహణం పరిమాణం 1.009గా ఉంటుంది. గ్రహణం penumbral magnitude 1.954గా ఉంటుంది.



గ్రహణం మొత్తం వ్యవధి ఎంత?
గ్రహణం మొత్తం వ్యవధి 5 ​​గంటలు 2 నిమిషాలు ఉంటుంది. పాక్షికంగా కనిపించే సమయం మొత్తం వ్యవధి 2 గంటల 53 నిమిషాలు. సంపూర్ణ గ్రహణం వ్యవధి 14 నిమిషాలు పడుతుంది.



చంద్ర గ్రహణం అంటే ఏమిటి?
పౌర్ణమి రోజున భూమి సూర్యుడు, చంద్రుడి మధ్య వచ్చినప్పుడు ఇలా బ్లడ్ మూన్ ఏర్పడుతుంది. మూడు ఒకేసారి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ చంద్రుడు భూమి నీడ కిందికి వచ్చినప్పుడు చంద్రునిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అది పాక్షిక చంద్ర గ్రహణంగా ఏర్పడుతుంది.