Omphalocele Covid Patients: కరోనాతో ఊపిరితిత్తులు పాడైతే.. బొడ్డుతాడుతో ట్రీట్‌మెంట్

కరోనావైరస్ సోకిన వారిలో ఎక్కువగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది.. ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినడంతో చాలామంది కరోనా బాధితులు ఊపిరి అందక ప్రాణాలు కోల్పోతున్నారు.

Omphalocele Covid Patients: కరోనాతో ఊపిరితిత్తులు పాడైతే.. బొడ్డుతాడుతో ట్రీట్‌మెంట్

Omphalocele Covid Patients

Omphalocele Covid Patients : కరోనావైరస్ సోకిన వారిలో ఎక్కువగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది.. ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినడంతో చాలామంది కరోనా బాధితులు ఊపిరి అందక ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయిన వారికి బొడ్డుతాడుతో చికిత్స అందించవచ్చునట.. ట్రాన్స్‌సెల్‌ ఆంకాలాజిక్స్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుభద్ర ద్రావిడ ఈ విషయాన్ని తెలిపారు. హైదరాబాద్‌ యూనివర్శిటీలోని అస్పైర్‌ టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌కు చెందిన బయోటెక్‌ స్టార్టప్‌ సంస్థ ‘ట్రాన్స్‌ సెల్‌ ఆంకాలజిక్స్‌’ ఈ కొవిడ్‌ ట్రీట్ మెంట్‌ను ప్రారంభించింది.

కరోనా సోకిన వ్యక్తుల్లో ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో విడుదలయ్యే కొన్ని రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ సమయంలో బొడ్డుతాడు నుంచి తీసిన మూల కణాలను ఇంజక్షన్‌ రూపంలో పేషెంట్‌కు ఇవ్వడం ద్వారా ప్రాణాలతో బయటపడొచ్చునని గుర్తించారు. బొడ్డుతాడు నుంచి తీసిన ఈ సెల్స్‌ను ఎక్కించడం ద్వారా శరీరానికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని స్పష్టం చేశారు. అమెరికాలో బొడ్డుతాడుతో ట్రీట్ మెంట్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని డాక్టర్ సుభద్ర చెప్పారు. భారతదేశంలో కూడా ఈ ట్రీట్ మెంట్ చేస్తున్నారని తెలిపారు.

అత్యవసర సమయంలో ఈ ట్రీట్ మెంట్ కోవిడ్ బాధితులకు చేయొచ్చునని అన్నారు. ఆస్పత్రుల నుంచి సేకరించిన బొడ్డుతాళ్ల నుంచి సేకరించిన సెల్స్‌ను రెట్టింపు చేస్తామని అన్నారు. ఆ సెల్స్‌ను అభివృద్ధి చేసి అవసరమున్న వారికి అందిస్తామని తెలిపారు. బొడ్డుతాడు సెల్స్‌ను వైద్యులకు ఇస్తే.. ఇంజక్షన్‌ రూపంలో కరోనా పేషెంట్లకు ఇవ్వొచ్చునని చెప్పారు. ఇలా కరోనా బాధితులను ప్రాణపాయం నుంచి కాపాడవచ్చునని అంటున్నారు.