Malnutrition : పౌష్టికాహార లోపం… చిన్నారులు,గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత

పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరి. ఆహారంలో స్ధూల

Malnutrition : పౌష్టికాహార లోపం… చిన్నారులు,గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత

Food

Malnutrition : పోషక విలువలతో కూడిన ఆహారం తోసుకోక పోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం అధికంగా కనిపిస్తోంది. దీని వల్ల మానసిక, శారీరక సమస్యలతోపాటు, రక్తహీనతల లోపం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు పోషకాహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలను చేపడుతున్నాయి. ప్రతి ఏటా సెప్టెంబరు 1 నుండి 30వ తేది వరకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు.

పోషకాహారం తీసుకోకపోవటం వల్ల చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బరువు లేకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. గర్భీణులలో పిండం సరిగా ఎదగకపోవటం, పుట్టబోయే బిడ్డ మానసిక స్ధితిపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రాధమిక దశలోనే పోషకాహార లోపాన్ని గుర్తించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పోషకాహార లోప నివారణకు గత ఏడాది నుండి సంపూర్ణ పోషణ పధకాన్ని ప్రారంభించింది. చిన్నారులకోసం బాలా మృతం కార్యక్రమం చేపట్టింది. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా దీనిని అమలు చేస్తోంది.సంపూర్ణ పోషణలో పిల్లలకు, గర్బీణులకు కందిపప్పు, బియ్యం, గుడ్లు అందేస్తుండగా, బాలింతలకు,గర్బీణులకు ప్రత్యేక కిట్లు అందిస్తారు. ఈ కిట్లలో రాగి పిండి, జొన్న పిండి, అటుకులు, చిక్కీ, బెల్లం, ఖర్జూరాలు, అటుకులు ఉంటాయి.

పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరి. ఆహారంలో స్ధూల పోషకాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. సూక్ష్మ పోషకాలను కొద్ది మొత్తంలో తీసుకుంటే సరిపోతుంది. పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు శరీరానికి అవసరమౌతాయి.

ఎక్కవ పోషకాలు ఉండే ఆహారాలకు సంబంధించి బ్రౌన్ రైస్, కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, రాజ్మా, శనగలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, రాగులు, బార్లీ, పచ్చిబఠాణీలు, ఓట్స్, క్వినోవా, బ్లాక్ రైస్ వంటి వాటిని తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు బాగా అందుతాయి. గోధుమ పిండి, రాగుల పిండి, జొన్న పిండి, సోయా పిండి, కొబ్బరి వంటి వాటితో తయారు చేసిన ఆహార పదార్ధాలు తినటం మంచిది. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఖర్భూజా గింజలు, అవిశె గింజలు, సబ్జా గింజలు, చియా గింజలు, వంటి వాటిని తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రొటీన్స్, మినరల్స్ లభిస్తాయి.