Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!

రక్తహీనత సమస్య ఉత్పన్నం అయినప్పుడు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం వల్ల రక్తాన్ని త్వరితగతిన వృద్ధి చేసుకోవచ్చు. ముడి నువ్వుల్లో కొంచెం బెల్లం కలిపి తీసుకోవటం వల్ల రక్తం పెరుగుతుంది.

Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!

Anemia

Anemia : మనిషి జీవించటానికి ప్రాణవాయువును శరీరానికి అందించటంలో ఐరన్ దోహదహం చేస్తుంది. రక్తంలో ఐరన్ తగ్గటం వల్ల శరీరంలో తెల్లగా పాలిపోతుంది. రక్తహీనతకు ఇదొక హెచ్చరిక, దీనిని ఆయుర్వేదంలో పాండు వ్యాధి అంటారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. రక్తహీనత సమస్య స్త్రీలలో అధికంగా ఉంటోంది. దీనికి కారణం సరైన పోషకాహారం తీసుకోక పోవటం, సమయానికి తినకుండా ఉండటం, ఉపవాసాలు వంటివి రక్తహీనతకు కారణమౌతున్నాయి.

అంతేకాకుండా అధిక రక్తస్రావం, ఎక్కవ మంది పిల్లలకు జన్మ నివ్వటం, పెద్ద గాయాల కారణంగా రక్తలేమి సమస్యను చవిచూడాల్సి వస్తుంది. ఎదిగుతున్న పిల్లల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల సమస్య వెలుగు చూస్తుంది. కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే వ్యాధులు, కొన్ని రకాల వ్యాధులకు వాడే దీర్ఘకాలిక మందులు, వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనతతో బాధపడేవారిలో కనురెప్పల లోపలి భాగం పేలవంగా మారుతుంది. తీవ్రమైన బలహీనత, కళ్లు తిరగడం, ఆయాసం, గుండెదడ, రక్తపోటు తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రక్తహీనత సమస్య ఉత్పన్నం అయినప్పుడు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం వల్ల రక్తాన్ని త్వరితగతిన వృద్ధి చేసుకోవచ్చు. ముడి నువ్వుల్లో కొంచెం బెల్లం కలిపి తీసుకోవటం వల్ల రక్తం పెరుగుతుంది. పండ్లు, పాలు, ఆకుపచ్చని కాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. తియ్యని మామిడి పండ్లు రక్తహీనత సమస్యనుండి త్వరగా బయటపడేస్తాయి. ఒక టీస్పూన్ అతిమధురం చూర్ణంలో ఒక టీస్పూన్ తేనె కలిపి రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. కప్పు ఉసిరికాయ రసంలో లేదంటే కప్పు చెరుకు రసంలో రెండు టీ స్పూన్ల తేనె కలపి తీసుకుంటే రక్తహీనత నుండి బయటపడవచ్చు.