Costly Mango: కిలో మామిడి ధర రూ.2.7లక్షలు

మధ్యప్రదేశ్ లోని దంపతులు రెండు మామిడి చెట్లకు కాపాలాగా 12మంది కాపాలాదారులను, కుక్కలను పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.2.7లక్షలు పలికే మామిడి రకం ఇది. మియాజాకీ అని పిలిచే ఈ మామిడి పండ్లు.. బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లలో మాత్రమే దొరుకుతాయి.

Costly Mango: కిలో మామిడి ధర రూ.2.7లక్షలు

Mangoe Rate

Costly Mango: మధ్యప్రదేశ్ లోని దంపతులు రెండు మామిడి చెట్లకు కాపాలాగా 12మంది కాపాలాదారులను, కుక్కలను పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.2.7లక్షలు పలికే మామిడి రకం ఇది. మియాజాకీ అని పిలిచే ఈ మామిడి పండ్లు.. బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లలో మాత్రమే దొరుకుతాయి.

ఎక్కువగా ఎండ ఉండి సూర్యప్రకాశం పుష్కలంగా లభించే ప్రాంతాల్లోనే ఇవి పండుతాయి. వీటిని జపాన్ లో అయితే Taiyo-no-Tomago అని పిలుస్తారు.

ఇవి పూర్తిగా పండిన తర్వాత ఎరుపురంగులోకి వచ్చేస్తాయి. వీటిని ఎగ్స్ ఆఫ్ సన్.. సూర్యుడి పండు అని పిలుస్తుంటారు. ఒక్కొక్కటి సుమారుగా రూ.350గ్రాముల నుంచి రూ.900గ్రాముల వరకూ బరువు ఉంటాయి. ఇతర మామిడి రకాలతో పోలిస్తే దాదాపు 15శాతం తీపి ఎక్కువగా ఉంటుంది.

విదేశాలకు ఎగుమతి చేసే ముందు క్వాలిటీ టెస్టు చేసి కొన్నింటిని మాత్రమే పంపిస్తారు. 1984నుంచి ఈ మామిడి రకాన్ని పండిస్తున్న జపాన్.. తొలి నాళ్లల్లో ఎక్కువ వర్షపాతం ఉన్న సమయంలోనే సాద్యపడేది. వేడి వాతావరణంలో పండే పంట చాలా కాస్ట్లీ పండు అన్నమాట. ఏప్రిల్ నుంచి ఆగష్టు నెల మధ్య కాలంలో ఇవి రెడీ అవుతాయి.

వీటిల్లో రిచ్ యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, ఫోలిక్ యాసిడ్ ఉండటంతో దృష్టి కూడా మెరుగవుతుంది. వీటి ధర బాక్సు రూ.8వేల 600 నుంచి మొదలై రూ.2.7లక్షల వరకూ పెరుగుతుంది.