India Covid Positivity : భారత్‌లో కరోనా విజృంభణ : 533 జిల్లాల్లో 10శాతానికిపైగా పాజిటివి రేటు

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 533జిల్లాల్లో 10శాతం పాజిటివిటి రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని 700కుపైగా జిల్లాల్లో 533 మందిలో 10 శాతానికి పైగా టెస్ట్ పాజిటివిటీ రేటు నమోదైందని ప్రభుత్వం తెలిపింది.

India Covid Positivity : భారత్‌లో కరోనా విజృంభణ : 533 జిల్లాల్లో 10శాతానికిపైగా పాజిటివి రేటు

Massive Covid Spread 533 Districts Reporting Over 10percent Positivity

India Covid Positivity Massive Covid spread : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 533జిల్లాల్లో 10శాతం పాజిటివిటి రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని 700కుపైగా జిల్లాల్లో 533 మందిలో 10 శాతానికి పైగా టెస్ట్ పాజిటివిటీ రేటు నమోదైందని ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపించిందని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో మొత్తం 13 రాష్ట్రాల్లో 1 లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆరు రాష్ట్రాల్లో 50వేల నుంచి 1 లక్ష వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో 50వేల కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 37 లక్షలకు పైగా చేరింది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో అన్ని కొవిడ్-19 టెస్టుల్లో 30 శాతానికి మించి రాపిడ్ యాంటిజెన్ టెస్టులు (RAT) ఉండకూడదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు పెంచడానికి స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లలో టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా RAT టెస్టులను వేగంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భార్గవ అన్నారు. రాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో తొందరగా ఫలితాలు వస్తాయి. కానీ RT-PCR పరీక్షల కంటే చాలా తక్కువ కచ్చితమైనవి. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ -19 కేసుల్లో భారత జాతీయ పాజిటివిటీ రేటు సుమారు 20-21 శాతంగా ఉంది. దేశంలో 42 శాతం జిల్లాల్లో జాతీయ సగటు కంటే పాజిటివిటీ రేటును ఎక్కువగా నివేదిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఐదు రాష్ట్రాల్లో, 30కి పైగా జిల్లాలు 10 శాతానికి పైగా కేసుల పాజిటివిటీని నివేదిస్తున్నాయని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్ (45 జిల్లాలు), ఉత్తర ప్రదేశ్ (38), మహారాష్ట్ర
(36), తమిళనాడు (34), బీహార్ (33) ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాల్లో, 20కి పైగా జిల్లాలు 10 శాతానికి పైగా పాజిటివిటి నమోదవుతున్నాయి. కర్ణాటక (28), రాజస్థాన్
(28), ఒడిశా (27), ఛత్తీస్‌గఢ్(24), గుజరాత్ (23), హర్యానా (22), పశ్చిమ బెంగాల్ (22), అస్సాం (20)లో కూడా పాజిటివిటి నమోదవుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాల్లో
10 శాతానికి పైగా జిల్లాలు ఉన్నాయి జార్ఖండ్ (18), పంజాబ్ (18), కేరళ (14), అరుణాచల్ ప్రదేశ్ (13), ఆంధ్రప్రదేశ్ (12), హిమాచల్ ప్రదేశ్ (12), ఉత్తరాఖండ్ (12), ఢిల్లీ
(11)గా నమోదవుతున్నాయి. మే 5-11 వారంలో 26 రాష్ట్రాలు 15 శాతానికి పైగా పాజిటివిటిని నివేదించాయని కేంద్రం తెలిపింది. ఆరు రాష్ట్రాల్లో 5-15 శాతం పాజిటివిటిని
నివేదించాయి. నాలుగు రాష్ట్రాలు మాత్రమే 5 శాతం కంటే తక్కువ పాజిటివిటిని నమోదు చేశాయి.

ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు 25 శాతానికి పైగా పాజిటివిటిని కలిగి ఉన్నాయని కేంద్రం తెలిపింది. గోవా (49.6 శాతం), పుదుచ్చేరి (42.8 శాతం), పశ్చిమ
బెంగాల్ (34.4 శాతం), హర్యానా (34.3 శాతం), కర్ణాటక (32.4 శాతం), రాజస్థాన్ (30 శాతం). చండీగఢ్ (27.5 శాతం), ఆంధ్రప్రదేశ్ (26.2 శాతం), ఢిల్లీ (25.7 శాతం)గా
పాజిటివిటి నమోదైంది. 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు ఉంటున్నాయి. అందులో కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్,
ఒడిశా, పంజాబ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.