వాలంటైన్స్ డే ఆఫర్: నో లవర్స్.. సింగిల్స్‌కు మాత్రమే ఫ్రీ ఆఫర్

వాలంటైన్స్ డే కు మిగిలింది.. ఇంకా మూడు రోజులు మాత్రమే. ప్రేమికుల రోజున పబ్లిక్ పార్క్ లన్నీ కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా కేఫ్ లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు రంగురంగుల పూలతో డెకరేట్ చేస్తారు.

  • Published By: sreehari ,Published On : February 11, 2019 / 10:12 AM IST
వాలంటైన్స్ డే ఆఫర్: నో లవర్స్.. సింగిల్స్‌కు మాత్రమే ఫ్రీ ఆఫర్

వాలంటైన్స్ డే కు మిగిలింది.. ఇంకా మూడు రోజులు మాత్రమే. ప్రేమికుల రోజున పబ్లిక్ పార్క్ లన్నీ కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా కేఫ్ లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు రంగురంగుల పూలతో డెకరేట్ చేస్తారు.

వాలంటైన్స్ డే కు మిగిలింది.. ఇంకా మూడు రోజులు మాత్రమే. ప్రేమికుల రోజున పబ్లిక్ పార్క్ లన్నీ కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా కేఫ్ లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు రంగురంగుల పూలతో డెకరేట్ చేస్తారు. ప్రత్యేకించి స్పెషల్ ప్రొగ్రామ్ లు, డిస్కౌంట్ లు, ఫ్రీ కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తుంటారు. ప్రేమజంటల కోసం స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. వాలంటైన్స్ డే రోజున పబ్లిక్ ప్రాంతాల్లో ఎక్కడ చూసిన గులాబీ పువ్వుల గుబాళింపు వెదజల్లుతూ ఉంటుంది. రంగురంగుల రోజాపూలతో రంగులమాయంగా నిండిపోతుంది. ప్రతి రెస్టారెంట్ లో ప్రేమ జంటల కోసం స్పెషల్ వంటకాలను సర్వ్ చేస్తుంటారు.

లవర్స్ కేనా ఆఫర్లు.. సింగిల్స్ మాటేంటి? 
వాలంటైన్స్ డే రోజున ప్రేమజంటలకు మాత్రమేనా.. ఆఫర్లు.. మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి? ఎవరితోనూ రిలేషిన్ షిప్ లో లేకుండా సింగిల్ గా వచ్చిన వారికి ఎలాంటి ఆఫర్లు ఉండవా? సింగిల్స్ కూడా తమ స్నేహితులతో కలిసి లవర్స్ డే రోజున పబ్లిక్ ప్రాంతాల్లో ఎంజాయ్ చేయాలని ఉండదా? అంటే.. ఎందుకు ఉండదు.. తప్పక ఉంటుంది. అందుకే సింగిల్స్ కోసం వాలంటైన్స్ డే రోజున వినూత్నంగా ఈవెంట్ చేయనున్నారు.

MBA చాయ్ వాలా.. సింగిల్స్ కోసం స్పెషల్ ఈవెంట్
అహ్మదాబాద్ లోని ఓ కేఫ్ లో సింగిల్స్ కోసం స్పెషల్ ఈవెంట్ కండక్ట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ లో ప్రేమజంటలు, కపుల్స్ కు అనుమతి లేదు. కేవలం సింగిల్స్ కు మాత్రమే ఫ్రీ ఎంట్రీ. ఎంబీఏ డ్రాప్ ఔట్ అయిన ఓ యువకుడు వాలంటైన్స్ డే కోసం చాయ్ వాలా అవతారమెత్తాడు. ‘ఎంబీఏ చాయ్ వాలా’అనే టీ స్టాల్ ప్రారంభించాడు. అహ్మదాబాద్ కు చెందిన ప్రఫూల్ బిల్లోరే అనే యువకుడు తన ఫేస్ బుక్ అకౌంట్ లో వాలంటైన్స్ డే కోసం ఈవెంట్ క్రియేట్ చేశాడు. ఇందులో సింగిల్స్ కు మాత్రమే తన కేఫ్ లో ఫ్రీగా చాయ్ ఆఫర్ చేస్తున్నాడు. ఈ కేఫ్ రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ గా ఉంటుంది. ‘‘వాలంటైన్స్ డే రోజున ప్రేమ జంటలే ఎందుకు ఎంజాయ్ చేయాలి. సింగిల్స్ కూడా ఎంజాయ్ చేయాలి. ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజున సింగిల్స్ అందరికి ఫ్రీ గా చాయ్ సర్వ్ చేయనున్నాం’’ అని ఫేస్ బుక్ డిస్ర్కప్షన్ పేజీలో పెట్టాడు. 
 

MBA మానేసి.. Tea Stall పెట్టాడు
ఇండియాలోనే టాప్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ప్రఫూల్.. చదవడం కష్టంగా మారింది. దీంతో ఎంబీఏ నుంచి డ్రాప్ ఔట్ అయి సొంతంగా టీ స్టాల్ పెట్టాడు. అంత ఈజీగా కాదు.. ఎంబీఏ చదవడం ఆపేసిన అతడిపై బంధువులు, సమాజం నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. చివరికి 2017లో సొంతంగా రూ.8వేల పెట్టుబడితో టీ కొట్టు ప్రారంభించాడు. భారతీయులకు టీ పై ఎంత మక్కవ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏడాదిలోనే ఫ్రపూల్ బిజినెస్ పెరిగింది. టీ తో పాటు స్నాక్స్ కూడా అమ్మేవాడు. ఇలా అందరిలో పాపులర్ అయిన 22ఏళ్ల ప్రఫుల్.. ఇప్పుడు ‘ఎంబీఏ చాయ్ వాలా’గా ఫుల్ క్రేజ్ సంపాదించాడు.

సింగిల్స్ కు Free చాయ్ 
వాలంటైన్స్ డే రోజున ప్రతి కేఫ్, రిస్టారెంట్ ప్రేమజంటల కోసం స్పెషల్ ప్రొగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాయి. కానీ, సింగిల్ గా వచ్చిన మిగతా వారిని పెద్దగా పట్టించుకోరు. ఆ రోజంతా సింగిల్స్ గా ఉన్నవారు బోరుగా ఫీల్ అవుతుంటారు. అందుకే సింగిల్స్ కోసం తన కేఫ్ లో ఫ్రీ గా చాయ్ సర్వ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఇలా తన కేఫ్ కు సింగిల్స్ ను ఇన్వైట్ చేసి ఫ్రీ చాయ్ సర్వ్ చేయడం వల్ల బిజినెస్ తో పాటు మంచి గుడ్ ఫీల్ ఉంటుందని ప్రఫూల్ భావిస్తున్నాడు. తన కేఫ్ లో మగ్గీ, బన్ మస్కా; బ్రెడ్ బట్టర్, శాండ్ విచ్, ఫ్రెంచ్ ఫ్రై, స్నాక్ ఇలా 35 రకాల వెరైటీలు సర్వ్ చేస్తున్నట్టు చెప్పాడు.  

Also Read : ‘వాలెంటైన్స్ డే’ ను ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకుంటారు…?

Also Read :  2019 వాలంటైన్స్ డే: ‘రోజా’లకు ఫుల్ గిరాకీ.. 30 కోట్లుపైనే!

Also Read :  ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!