Meditation : మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమే మార్గమా!

ధ్యానం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒత్తిళ్లను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వస్తుంది. ఇంట్లో ధ్యానం చేసే వాతావరణ లేకుంటే పార్క్ , దేవాలయం, ఇలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో ధ్యానం చేయటం మంచిది.

Meditation : మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమే మార్గమా!

Meditation

Meditation : మనిషి జీవితం హ్యాపీ నడిచిపోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండటం అవసరం. ఇటీవలి కాలంలో జీవనశైలిలో మార్పులు, ఉరుకుల పరుగుల జీవితంతో చాలా మందిలో ప్రశాంతతకొరవడుతుంది. అయితే మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం కోసం చాలా మంది వివిధ రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ఎన్ని మార్గాలు అనుసరించినా రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతతను పొందటంలో ధ్యానానికి మించిన మార్గం లేదు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పది నిమిషాలు ధ్యానానికి కేటాయిస్తే పరిపోతుంది. రోజంతా మనస్సు ఆనందంగా ఉంటుంది.

రోజు వారిగా ధ్యానం చేయాలనుకుంటే అందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఉదయపు సూర్యకిరణాలు పడే విధంగా చూసుకోవాలి. ఏకాగ్రతకు భంగం కలిగించని ప్రదేశంలో కూర్చోవటం వల్ల ధ్యానం ఎలంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. సూర్యకిరణాలకు ఎదురుగా కూర్చోవటం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. ధ్యానంలో తొలుత శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి. దీర్ఘం శ్వాస తీసుకుని నిదానంగా వదలాలి. ఇలా చేయటం హృదయ స్పందనలపై అనుకూల ప్రభావం చూపుతుంది.

ధ్యానం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒత్తిళ్లను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వస్తుంది. ఇంట్లో ధ్యానం చేసే వాతావరణ లేకుంటే పార్క్ , దేవాలయం, ఇలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో ధ్యానం చేయటం మంచిది. దీని వల్ల మనస్పుపై మంచి ప్రభావం ఉంటుంది. నిత్యం ధ్యానం చేయటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతోపాటు ఆలోచనలు మీద, ఉద్వేగాల మీద అదుపు కలిగిఉంటారు. త్వరగా రోగాలకు గురికాకుండా చూసుకోవచ్చు.