Harbhajan Kaur: 90 ఏళ్ల వయసులో ఎంట్రప్రెన్యూర్ గా మారిన బామ్మ

గ్రాడ్యుయేషన్ పూర్తి అవగానే లేదా యుక్త వయస్సుకు రాగానే లైఫ్ సెటిల్మెంట్ కోసం ఇంట్లో వాళ్లు తిడుతూనే ఉంటారు. వాళ్లు పోరు పడలేకో.. అవకాశం వచ్చిందనో కాస్త లేట్ అయినా కెరీర్ స్టార్ట్ చేస్తుంటాం. ఆ లేట్ 90ఏళ్ల వయస్సుకు చేరితే..

Harbhajan Kaur: 90 ఏళ్ల వయసులో ఎంట్రప్రెన్యూర్ గా మారిన బామ్మ

Harbhajan Kaur (1) (1)

Harbhajan Kaur: గ్రాడ్యుయేషన్ పూర్తి అవగానే లేదా యుక్త వయస్సుకు రాగానే లైఫ్ సెటిల్మెంట్ కోసం ఇంట్లో వాళ్లు తిడుతూనే ఉంటారు. వాళ్లు పోరు పడలేకో.. అవకాశం వచ్చిందనో కాస్త లేట్ అయినా కెరీర్ స్టార్ట్ చేస్తుంటాం. ఆ లేట్ 90ఏళ్ల వయస్సుకు చేరితే.. అవును ఇంత లేట్ వయస్సులో కెరీర్ స్టార్ట్ చేసిందో మహిళ. సాధారణంగానే స్టార్ట్ చేసినా అనుకున్నట్లుగానే రాణించి ఎలా అయితే పెద్దగా ఎదిగింది.

‘నా జీవితమంతా ఒక్క పైసా కూడా సంపాదించకుండానే గడిపేశా. ఆ తర్వాతే నా బిజినెస్ కెరీర్ స్టార్ట్ చేశా’ అని తన అనుభవాలను చెప్పింది.

ఆ స్టోరీ అంతా.. Humans of Bombay (HoB)అనే ప్లాట్ ఫాం షేర్ చేసింది. ఐదేళ్ల క్రితం తాను సొంతగా ఏదైనా మొదలుపెట్టాలని అనుకుంది. తనకు వంట వండటం అంటే చాలా ఇష్టం. అంతే తన శ్రమనే పెట్టుబడిగా పెట్టి మొదలుపెట్టేసింది. ఆ తర్వాత తన కూతురి బర్పీలు ఎందుకు అమ్మకూడదని ప్రశ్నించదట. ప్రశ్ననే ఆలోచనగా మార్చుకుని అవి కూడా స్టార్ట్ చేసేసింది.

వంట గదిలో గంటల కొద్దీ శ్రమించి తయారుచేసిన బర్ఫీలు గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయట. రోజుకు రూ.2వేల వరకూ సంపాదించాక తన పాపులారిటీ నిదానంగా పెరిగింది. అలా 2020లో ఎంట్రిప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకుంది.

ఒక్కసారిగా విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి ఆమెకు కూడా ఎఫెక్ట్ అయిందట. సెకండ్ వేవ్ లో కరోనా వచ్చినా.. పట్టుదలతో గెలిచి ఆరోగ్యవంతంగా తిరిగొచ్చింది. సోషల్ మీడియాలోనూ ఆమె తక్కువేం కాదు. ఈమెకు 12వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. మనువరాళ్లు ఆమె చేస్తున్న వంటను వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేస్తూ ఉంటారు.

ఆమె తన మనువళ్లకు చెప్తూ ఉంటుందట.. 95ఏళ్ల వయస్సులో మీ నాన్నమ్మ సాధించగలిగితే.. మీరెందుకు చేయలేరని ఎంకరేజింగ్ గా పిల్లలకు ప్రేరణ ఇస్తారట హర్భజన్ కౌర్.