Land Rover: 50ఏళ్ల నాటి ల్యాండ్ రోవర్ సునాయాసంగా నడిపేస్తున్న టీనేజర్

గ్లోబల్ మార్కెట్లలో.. ఇండియాతో కలిపి ల్యాండ్ రోవర్ ను రీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని పాపులారిటీ అలాంటిది మరి. బ్రిటీష్ బ్రాండ్ అయినటువంటి ఐకానిక్ వెహికల్, ల్యాండ్ రోవర్ సిరీస్‌కు..

Land Rover: 50ఏళ్ల నాటి ల్యాండ్ రోవర్ సునాయాసంగా నడిపేస్తున్న టీనేజర్

Land Rover

Land Rover: గ్లోబల్ మార్కెట్లలో.. ఇండియాతో కలిపి ల్యాండ్ రోవర్ ను రీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని పాపులారిటీ అలాంటిది మరి. బ్రిటీష్ బ్రాండ్ అయిన ఐకానిక్ వెహికల్, ల్యాండ్ రోవర్ సిరీస్ కు చెందిన వాహనానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొట్టమొదటి ల్యాండ్ రోవర్ సిరీస్ 1 లాంచ్ చేసి 70 సంవత్సరాలు అయింది.

ఎలాంటి రోడ్లపైన అయినా.. రోడ్ లేని ప్రాంతాల్లోనైనా ఇది దూసుకెళ్లిపోతుంది. అప్పటి ఈ బ్రిటీష్ మోడల్‌ను ఇండియన్ టీనేజర్ ఎలా డ్రైవ్ చేస్తుందో చూడండి. అసలు ఈమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో కూడా తెలీదు.. కానీ, సింపుల్ గా సరదాగా డ్రైవ్ చేసేస్తుంది.

వీడియో చూస్తుంటే.. అది పూర్తి ఫిట్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. తుప్పు అక్కడక్కడ కనిపిస్తుంది. నిజానికి తుప్పు అనేది చాలా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది. ఒరిజినల్ ఇంజిన్ వరకూ చేరకపోతే బెటరే. ఈ ల్యాండ్ రోవర్ ఇంజిన్ ఒరిజినల్ కాదట.

ఆ డీజిల్ ఇంజిన్ మహీంద్రా బొలెరోది దీనికి ఫిట్ చేసేశారట. అందుకే ఒరిజినల్ సిరీస్ కంటే డిఫరెంట్ సౌండ్ తో వినిపిస్తుంది. ఈ ల్యాండ్ రోవర్ సిరీస్ ప్రొడక్షన్ 1948లో మొదలైంది.