Samantha Ramsdell : వామ్మో.. ఎంత పెద్దనోరు ఈమెది.. గిన్నీస్ బుక్ రికార్డు బ్రేక్ చేసిందిగా!

వామ్మో.. ఎంతపెద్ద నోరో కదా ఈమెది.. గిన్నీస్ బుక్ రికార్డు బ్రేక్ చేసింది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ మహిళ తన అతిపెద్ద నోటితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది. ఆమె ఎవరో కాదు.. 31ఏళ్ల సమంతా రామ్‌స్‌డెల్‌.

10TV Telugu News

Samantha Ramsdell Mouth Gape : వామ్మో.. ఎంతపెద్ద నోరో కదా ఈమెది.. గిన్నీస్ బుక్ రికార్డు బ్రేక్ చేసింది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ మహిళ తన అతిపెద్ద నోటితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది. ఆమె ఎవరో కాదు.. 31ఏళ్ల సమంతా రామ్‌స్‌డెల్‌ (Samantha Ramsdell).

Meet The Woman

టిక్ టాక్ వీడియోల్లో తనదైన హాస్యంతో నెటిజన్లను ఆకర్షించింది. ఇప్పుడు గిన్నిస్ బుక్ లోకి ఎక్కేసింది. ఇంతకీ ఆమె నోరు ఎంత పెద్దదో తెలుసా? దాదాపు 6.52 సెంటీమీటర్లు ఉంటుంది. ఆమె దవడ పెద్దగా సాగిపోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా రికార్డు క్రియేట్ చేసింది.

Gunnis

టిక్‌టాక్ వీడియోలలో వివిధ యాంగిల్స్‌లో తన నోటీని సాగదీస్తూ పిల్లలను ఆకట్టుకునేది. అలా ఆమె ప్రపంచ రికార్డును సాధించింది. అమెరికాలోని కనెక్టికట్‌లోని సౌత్ నార్వాక్‌లో డెంటల్ హాస్పటిల్‌లో ఆమె నోటి కొలతలను కొలిచారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కోసం ఆమె నోటిని గ్యాప్ కొలిచారు.

Meet The Woman Whose Record Breaking Mouth Gape Went Viral On Tiktok

డాక్టర్ ఎల్కే చెయంగ్ సామ్ నోటి పొడవు, వెడల్పును లెక్కించేందుకు డిజిటల్ కాలిపర్‌లను ఉపయోగించారు. నోటి అన్ని కొలతలు తీసుకున్నారు. చిన్న వయస్సు నుంచే సామ్ పెద్ద నోరు ఉందని చాలామందికి తెలుసు. ఆమె చిన్ననాటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Mouth Gape

తనలో లోపాన్ని హాస్యంగా మలిచి : 
ఆమె కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఇంత పెద్ద నోరు లేదు. సామ్ కు మాత్రమే ఇంత పెద్ద నోరు ఉండటం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె పెరిగే కొద్ది నోరు కూడా పెరిగిపోయింది. చిన్నతనంలో తన పెద్దనోటిని చూసి తోటివాళ్లు వేధించేవారు.. ఎగతాళి చేసేవారు. కానీ, సామ్ మాత్రం పాజిటివ్ గానే తీసుకుంది. ఎప్పుడూ కూడా తనలో లోపాన్ని చూసి బాధపడలేదు. పైగా అదే నోటితో అందరికి నవ్వులను పంచింది. టిక్ టాక్ వీడియోలను చేస్తూ.. తన నోటీతో అనేక ఫీట్స్ చేసి అందరిని అబ్బురపరిచింది. ఆమె నోటి గ్యాపులో ఒక ఆపిల్ మొత్తం పట్టేంత పెద్దగా తెరవగలదు.

Mouth

నాలుగు సింగిల్ చీజ్ బర్గర్ లను ఒకేసారి అమాంతం మింగేయగలదు. అతిపెద్ద పరిమాణంలో ఫ్రెంచ్ ప్రైస్ ను నోటిలో ఒకేసారి పెట్టుకోగలదు. తన మౌత్ ఫీట్స్ ను టిక్‌టాక్ అకౌంట్లో పోస్టు చేస్తుండేది. గత ఏడాది మహమ్మారి సమయంలోనూ సరికొత్తగా ఫీట్స్ తో తన ఫాలోవర్లను ఆకట్టుకుంది.

Woman Mech Donald

మెక్ డోనాల్డ్ ఫ్రైయిస్ ఒకేసారి తన నోటిలో పెట్టుకుని మింగేసింది. ముందుగా ఒకటి తర్వాత ఒకటి నోట్లో పెట్టుకుంది. ప్యాకెట్ లోని మొత్తం ఫ్రైయిస్ తన నోటి సైజుకు పరిమాణానికి సరిపోయాయి. ఒకేసారి తినేసి వావ్ ఎంత రుచిగా ఉన్నాయో అంటూ తన యూట్యూబ్ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

Mec Donald

10TV Telugu News