OverConfidence: ఆ విషయంలో మహిళల కంటే మగాళ్లకే ఓవర్‌కాన్ఫిడెన్స్ ఎక్కువ!!

మహిళల కంటే మగాళ్లకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువని ఓ స్టడీలో తేలింది. ఎటువంటి ట్రైనింగ్ లేకుండా టాస్క్ లు కంప్లీట్ చేసే విషయంలో అలా ప్రవర్తిసారని స్టడీ ద్వారా తెలిసింది.

OverConfidence: ఆ విషయంలో మహిళల కంటే మగాళ్లకే ఓవర్‌కాన్ఫిడెన్స్ ఎక్కువ!!

Over Confidence

OverConfidence: మహిళల కంటే మగాళ్లకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువని ఓ స్టడీలో తేలింది. ఎటువంటి ట్రైనింగ్ లేకుండా టాస్క్ లు కంప్లీట్ చేసే విషయంలో అలా ప్రవర్తిసారని స్టడీ ద్వారా తెలిసింది. వైకటో యూనివర్సిటీలో సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న కల్యా జోర్డాన్ అనే వ్యక్తి స్టడీ జరిపారు.

ఎయిర్ ప్లేన్ ల్యాండింగ్ విషయాన్ని ఎంచుకుని అందరికీ అవకాశం కల్పించారు.

వారందరికీ చూపించిన 3నిమిషాల వీడియోలో కనిపించిన 582 అంశాలను పలు విభాగాలుగా విభజించారు. ఎటువంటి ఉపయోగం లేని ఆ వీడియోలో.. ట్రైనింగ్‌కు గానీ, అవసరమైన సమచారం ఇవ్వడానికి పనికిరాకుండా ఉంది. ల్యాండింగ్ సమయంలో బటన్స్, నాబ్స్ లాంటివి పైలట్ వాడలేదు.

వీడియో చూసిన మందిలో తాము కూడా ఎయిర్ క్రాఫ్ట్‌ను సేఫ్ గా ల్యాండ్ చేయగలమని 62శాతం మంది చెప్పేశారు. కానీ, అందులో సగం మంది కనీసం 30శాతం కూడా ల్యాండింగ్ విషయంలో కాన్ఫిడెంట్ గా లేరు. ఇంకో విషయమేమిటంటే వీడియోను కూడా అస్సలు చూడకుండా సేఫ్ గా ల్యాండ్ చేయగలమంటూ 20శాతం మంది కాన్ఫిడెంట్ గా చెప్పారు.

Read Also: మహిళలు ముఖం చూసి చెప్పగలరట.. స్టడీలో బయటపడ్డ ఘోరమైన నిజాలు

ఇలా జరిగిన పూర్తి విశ్లేషణలో మహిళల కంటే మగాళ్లు 12శాతం ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించారు.

‘పురుషులు నాలెడ్జ్, కెపాసిటీలతో మహిళల కంటే ఎక్కువ నమ్మకంగా ఉంటారు. రన్నింగ్, డైవింగ్ వంటి వాతావరణంలో కూడా అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తారు. జెండర్ ఓవర్ కాన్ఫిడెన్స్ గ్యాప్ ఫిజికల్ గా ఫిట్ అనే ఆలోచనలో నుంచి వస్తుంది. అదే స్త్రీలు మాత్రమే చేయగల పనుల్లో మహిళలు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ను చూపించరు’ అని స్టడీ నిర్వహించిన కైలా జోర్డాన్ అంటున్నారు.