Menthi Leaves : లైంగిక సామర్ధ్యాన్ని పెంచే మెంతికూర

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.

Menthi Leaves : లైంగిక సామర్ధ్యాన్ని పెంచే మెంతికూర

Menthi

Menthi Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో మెంతికూరను అధికంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యయం తక్కువ, పోషకాలు ఎక్కువ ఉండే వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, తోటకూర.. తదితర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

మెంతి ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. అంతేకాకుండా ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది. గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖం మీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారి నుంచి విముక్తి అవ్వచ్చు.

పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. కామెర్లు వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. చలికాలంలో జీర్ణ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

మెంతి ఆకుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గడంతో ఇవి మీకు సహాయపడతాయి. అంతే కాదు ఇవి రక్త హీనతను కూడా దూరం చేస్తాయి. మెంతికూర కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని, పౌడర్ చేసి, గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి తాగాలిజ రెగ్యులర్ గా రోజుకు రెండు సార్లు తాగుతుంటే బ్లడ్ ప్రెజర్ అండర్ కంట్రోల్లో ఉంటుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది. స్త్రీలకు పనికొచ్చే ఔషధ గుణాలు అన్ని మెంతికూరలో ఉన్నాయి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి. మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. మెంతులలో కావలసినంత పీచు పదార్దాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. మెంతి ఆకులను తినడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. షుగర్ వ్యాధిని కూడా అదుపులో ఉంచే గుణం మెంతికూరకు ఉంది.