ఈ బ్యాక్టీరియా నీళ్లలో దాక్కొంటుంది.. ఇనుమునూ తినేస్తుంది..

  • Published By: sreehari ,Published On : July 16, 2020 / 08:24 PM IST
ఈ బ్యాక్టీరియా నీళ్లలో దాక్కొంటుంది.. ఇనుమునూ తినేస్తుంది..

బ్యాక్టిరీయాలు, సూక్ష్మజీవులు ఎలా పుట్టుకొస్తాయి? ఒక్కో బ్యాక్టీరియా మనుగడ ఎలా ఉంటుంది? కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి.. మరికొన్ని చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. కానీ, ఇవి కంటికి కనిపించవు.. కనిపించకుండా దాడి చేస్తుంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ లాంటి సూక్ష్మజీవులతో ప్రాణ సంకటమే మరి..

అసలు ఈ బ్యాక్టీరియాలు నీళ్లలోనూ ఉంటాయా? ఉంటే ఏమి తిని జీవిస్తాయి అనేదానిపై చాలా పరిశోధనలు కొనసాగాయి. ఇప్పుడు ఓ బ్యాక్టీరియా మాత్రం నీళ్లలో దాక్కొంటుుందంట.. ఇనుమునూ తినేస్తుందంట… ఈ విషయం తెలిసిన ఓ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ ఆశ్చర్య పోయాడు. ఒక రోజు అనుకోకుండా Jared Leadbetter.. తన ఆఫీసు సింక్‌లో మాంగనీస్‌తో ముంచిన ఒక కూజాను వదిలివేశారు. కొన్ని నెలల తరువాత తిరిగి వచ్చి పరిశీలించాడు.

నల్లటి పదార్థం కూజా అంచుకు ఉండటం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.. అసలు అది ఏంటి కనిపెట్టే దిశగా పరిశోధనలు చేశామని చెప్పాడు. లోహాన్ని తినే బ్యాక్టీరియాను గుర్తించారు. వంద సంవత్సరాలుగా వీటి జాతి కొనసాగుతోందని కనుగొన్నారు. గాజుసామానులో నల్ల పూత ఆక్సిడైజ్డ్ మాంగనీస్ తో కలిసి ఉన్నట్టు గుర్తించారు.

మాంగనీస్ వాడే బ్యాక్టీరియానే దీనికి కారణమని చాలా మంది శాస్త్రవేత్తలు భావించారు. దీనికి ఆధారాలు అందుబాటులో లేవు. సూక్ష్మజీవులు మాంగనీస్ ఆక్సైడ్‌ను తగ్గిస్తాయి.. అవి ఎలక్ట్రాన్లను వదిలేస్తాయి.. మనుషుల్లో ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్‌ను ఎలా ఉంటుందో అలాగే ఈ సూక్ష్మజీవులు మాంగనీస్ ఆక్సైడ్‌ను వినియోగిస్తుంటాయని గుర్తించారు.

కొత్తగా గుర్తించిన రెండు సూక్ష్మజీవుల్లో ఒక రకమైన Nitrospirae, betaproteobacterium, భూగర్భజలాలు, పంపు నీటిలో దాగి ఉంటాయని కనుగొన్నారు. కార్బన్ డయాక్సైడ్‌ను జీవపదార్ధంగా మార్చడానికి మాంగనీస్ నుంచి ఎలక్ట్రాన్లను తొలగిస్తాయి. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు chemosynthesis అని పిలుస్తారు.

సూక్ష్మజీవులు వాస్తవానికి మాంగనీస్‌ను ఆక్సీకరణం చేస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. వాస్తవానికి మాంగనీస్ భూమిపై అధికంగా లభించే లోహాలలో ఒకటిగా చెప్పవచ్చు. మాంగనీస్ ఆక్సైడ్ కూడా సముద్రపు అడుగుభాగంలో నోడ్యూల్స్ రూపంలో కనిపిస్తుంది. 1870లో HMS ఛాలెంజర్ రోజుల్లోనే గుర్తించారు. ఈ ప్రదేశంలో లోహపు బాల్స్ ఎలా ఏర్పడతాయో గుర్తించలేకపోయారు. మంచినీటి కంటే సముద్రపు నీటికి అనువుగా ఉండే ఇతర సూక్ష్మజీవులే కారణమని కొత్త అధ్యయనం సూచిస్తోంది.