Rice Flour : బియ్యం పిండితో మిలమిల మెరిసే చర్మం..

ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని.. ఫ్రెష్ లుక్ అందిస్తుంది. బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి.

Rice Flour : బియ్యం పిండితో మిలమిల మెరిసే చర్మం..

Rice

Rice Flour : చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసి పోవాలని చాలా మందికోరుకుంటుంటారు. ఇందుకోసం ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయితే మన ఇంట్లో తక్కువ ఖర్చుతో , అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించాలంటే ఆలోచిస్తుంటారు. మనం బయట నుండి కొనుగోలు చేసే ఫేస్ క్రీముల్లో హానికరమైన రసాయనాలు కలిసి ఉంటాయి. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మన ఇంట్లో దొరికే బియ్యపు పిండితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.

భారతదేశంలో ప్రధాన ఆహారంగా బియ్యాన్ని వాడుతుంటారు. బియ్యం తో కేవలం అన్నమే కాకుండా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, వడియాలు తయారు చేస్తూ ఉంటారు. కానీ బియ్యాన్ని కేవలం ఆహారంగానే కాకుండా సౌందర్య పోషణకు కూడా ఉపయోగించవచ్చు.

బియ్యంపిండి,కలబంద జెల్,తేనే కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిముషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలన మొటిమలు,మొటిమల మచ్చలు,నలుపుదనం పోయి ముఖం అందంగా మారుతుంది.

ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని.. ఫ్రెష్ లుక్ అందిస్తుంది. బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. నలుపుదనం కూడా తగ్గిపోతుంది.

బియ్యం పిండి మంచి ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుంది. ఒక బౌల్ లో బియ్యం పిండి, శనగపిండి, తేనె, పంచదార, కొబ్బరినూనె కలుపుకోవాలి. దీన్ని స్ర్కబ్ లా ఉపయోగిస్తే మృత కణాలు తొలగిపోయి తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. ఒక బౌల్ లో బియ్యం పిండి. ఎగ్ వైట్, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. ఈ ప్యాక్ వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తొలగిపోయి చర్మం టైట్ గా ఉంటుంది.