Milk : పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండటంలేదా! అసలు కారణాలు తెలిస్తే !

గది ఉష్ణోగ్రతకు ఎక్కువసేపు గురికావడం వల్ల పాలలో పీహెచ్ స్థాయి తగ్గడంతో, ప్రోటీన్ కణాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం ప్రారంభమైతే పిహెచ్ స్థాయి పడిపోతుంటాయి. దీంతో అది ఆమ్లంగా మారుతుంది. ఈ స్థితిలోనే పాలు విరిగిపోతాయి.

Milk : పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండటంలేదా! అసలు కారణాలు తెలిస్తే !

Milk does not last long! If you know the real reasons!

Milk : పాలు మన దైనందిన జీవితంలో భాగం అయిపోయాయి. అయితే ఇవి ఎక్కవ కాలం నిల్వ వుండవు. త్వరగా పాడై పోతుంటాయి. అందుకే వీటిని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద స్టోరేజ్ చేస్తుంటారు. ఉన్న పాలు బాగుండాలి. కానీ పాలను తెచ్చి పెట్టుకొని కాస్త ఆలస్యం చేసినా పాలు విరిగిపోతుంటాయి. ఒక్కోసారి పాలు ఒక రాత్రి నిల్వ ఉండడం కష్టమైపోతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో పాలు పాడైపోయి విరిగి పోతుంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం చాలా మంది అవగాహన ఉండదు.

అధిక ఉష్ణోగ్రత లేదా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచిన పాలు త్వరగా విరిగిపోవు. లేదంటే తొందరగా విరిగిపోతుంటాయి. పాలలో ఉండే ప్రోటీన్ యొక్క చిన్న కణాలు పాలలో స్వేచ్ఛగా తేలుతూ ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. ఈ దూరంగా ఉండటం వల్లే పాలు విరిగిపోకుండా ఉంటాయి. గది ఉష్ణోగ్రతకు ఎక్కువసేపు గురికావడం వల్ల పాలలో పీహెచ్ స్థాయి తగ్గడంతో, ప్రోటీన్ కణాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం ప్రారంభమైతే పిహెచ్ స్థాయి పడిపోతుంటాయి. దీంతో అది ఆమ్లంగా మారుతుంది. ఈ స్థితిలోనే పాలు విరిగిపోతాయి.

వేసవి కాలంలో మనం రోజుకు 3-4 సార్లు పాలు కాగబెట్టుకోవాలి. లేకుంటే పాలు విరిగిపోతాయి. అలాకాగ బెట్టుకోవటంతో పాటు, పాలను ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచుతాం. పాలు త్వరగా విరగకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

1. పాలు వేడిచేసేప్పుడే అందులో ఓ చిటికెడు సోడా వేయాలి. ఇలా చేస్తే త్వరగా పాలు విరగవు. విరిగిపోయేందుకు సిద్దంగా ఉన్న పాలు కూడా తాజాగా అవుతాయి.

2. పాలు కొన్న వెంటనే కాచి పెట్టుకోవాలి. ఒక్క పొంగుతో ఆపకుండా రెండు, మూడు పొంగులు వచ్చేవరకూ కాచాలి. కాచిన పాలను వాడుకోగా మిగిలిన వాటిని చల్లారిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయాలి.

3. పాలు వేడి చేసిన తరువాత వాడుకోగా మిగిలిన వాటిని ఫ్రిజ్ లో పెడతాం. తిరిగి వేడి చేస్తే చాలు విరిగిపోతాయి. అలాంటప్పుడు నేరుగా పాల గిన్నె స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో పాలగిన్నె పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కవ సేపు మరిగించకుండా దించేయాలి.

4. పాలు పొంగడం వల్ల కొన్ని సార్లు మనం చూడకపోతే స్టవ్ మొత్తం పడిపోతాయి. పాలు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచుకు కాస్త నూనె రాసుకోవాలి. పాలు పైవరకు పొంగురాకుండా ఉంటాయి. మార్కెట్లో సిలికాన్ తో తయారుచేసిన మూత అందుబాటులోకి వచ్చింది. దాన్ని పాల గిన్నెపై మూతగా పెడితే పొంగటం జరగదు.

5. కాచిన పాలను ఎండ తగిలే చోట పెట్టొద్దు. ఇలా చేస్తే వాటిలోని పోషకాలు పోతాయి. కాచిన గిన్నెలోనే పాలను ఉంచెయ్యాలి. గిన్నెలు మార్చొద్దు. అవసరమైన మేరకు మాత్రమే పాలను వేరే గిన్నెలోకి తీసుకుని వాడుకోవాలే తప్ప పదే పదే మొత్తం పాలను వేడి చేయొద్దు.

6. పాలను మందమైన గిన్నెలో, సన్నని మంటపై వేడి చేయాలి. పాలు కాచే ముందు గిన్నెలో కొంచెం నీళ్లు పోసి వేడి చేసి వాటిని పారబోసిన తరువాత మాత్రమే పాలను పోసి మరగించుకోవాలి.