Milk : శరీరానికి దివ్యౌషధం పాలు

పోలాల్లో , పచ్చిక బయళ్ళల్లో తిరుగుతూ ఉండే పాలల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. నీడపటున ఉండే పాడి గేదెల్లో పోషక విలువలు తక్కువనే చెప్పాలి.

Milk : శరీరానికి దివ్యౌషధం పాలు

Milk (2)

Milk : శరీరంలో జీవశక్తిని పెంపొందించటంలో , పిల్లల ఎదుగుదలకు , దీర్ఘాయుష్షుకు పాలు తాగటం ఎంతో అవసరం. ఇందులో మాంసకృత్తులు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మైన పోషకాలు పాల నుండి లభిస్తాయి. తల్లిపాలకంటే ఆవుపాలల్లో రెండింతలు మాంసకృత్తులు అధికంగా ఉంటాయని నిపుణులు నిర్ధారించారు. గేదెపాలల్లో ఆవుకంటే అధికమైన కొవ్వు పదార్ధాలు ఉంటాయి.

పాలల్లో విటమిన్ ఎ ఉంటుంది. వెన్నె తీసెటప్పుడు దానితోపాటు విటమిన్ ఎ కూడా బయటకు పోతుంది. విటమిన్ ఎ కావాలనుకుంటే మాత్రం వెన్న తీయని పాలను తాగటం మంచిది. పాలల్లో విటమిన్ సి స్వలంగా ఉంటుంది. పాలను కాసిన సందర్భంలో అది కూడా నాశనమై పోతుంది. సి విటమిన్ కోసం ఒక్క పాలపైనే అధారపడకూడదు.

పాలను సూర్యర్శిలో ఎక్కువ సేపు ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే బి కాంప్లెక్స్ లోని రిబోఫ్లెనిన్ నాశనమౌతుంది. అనుకోకుండా పాలు విరిగిపోతే వాటిని పడబోయకుండా కాస్త ఉప్పును చేర్చి తాగితే పలు విటమిన్ లు శరీరానికి అందుతాయి. సన్నగా నాజుకుగా కనబడాలనుకునే వారు వెన్న తీసిన స్కిమ్ మిల్క్ ను తాగటం మంచిది.

పోలాల్లో , పచ్చిక బయళ్ళల్లో తిరుగుతూ ఉండే పాలల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. నీడపటున ఉండే పాడి గేదెల్లో పోషక విలువలు తక్కువనే చెప్పాలి. పాలు తాగిన సమయంలో కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కాస్త ఉప్పు చేర్చుకోవటం మంచిది. జలుబు, టాన్సిలైటన్, గొంతు బొంగురు వంటి శ్వాసకోశ వ్యాధుల్లో వేడిపాలల్లో చిటికెడు పసుపు, కాస్తంత మిరియాల పొడితో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది.

పాలమీద మీగడలో పసుపు కలపి చీముగడ్డలు, తెగిన గాయాలు పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి పాలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాత్రి పడుకోబోయే ముందు ఒకగ్లాసు గోరు వెచ్చని పాలను సేవిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది. మరిగించిన పాలల్లో కొంచెం నిమ్మరసం వేసి కాళ్లు, చేతులు, మెడ బాగాలపై అప్లై చేస్తే చర్మం నాజుకుగా మారటంతోపాటు, నల్లని మచ్చలు తొలగిపోతాయి. శరీరం కాంతి వంతంగా మారుతుంది.

పాలల్లో కోడి గుడ్డు సొన కలిపి బాగా మిక్స్ చేసి తలకు పట్టిస్తే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటంతోపాటు, చుండ్రు సమస్య నుండి విముక్తి లభిస్తుంది. జట్టు రాలే సమస్య నుండి విముక్తి లభిస్తుంది.