Mint Tea : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే పుదీనా టీ! |Mint tea to cool the body in summer!

Mint Tea : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే పుదీనా టీ!

సాధారణంగా వేసవి సమయంలో జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతుంటాయి. వాటి నుండి బయటపడాలంటే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పుదీనా టీ తీసుకోవటం మంచిది.

Mint Tea : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే పుదీనా టీ!

Mint Tea : వేసవిలో ఎండలు మండిపోతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వేసవి కాలంలో చాలా మంది చల్లని పానీయాలను తాగేందుకు ఎక్కవ ఆసక్తి చూపిస్తుంటారు. వేడిగా ఉండే టీ,కాఫీల వంటి వాటిని తాగేందుకు ఏమాత్రం ఇష్టపడరు. అయితే వేసవి కాలంలో పుదీనాతో చేసిన టీని తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో ఎన్నో పోషక విలువలు ఉండటంతో వేసవి కాలంలో ఈ టీ తాగటం వల్ల శరీరం అధిక ఉష్ణోగ్రతల ప్రభావం నుండి రక్షించబడుతుంది.

వేసవి కాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ టీని తీసుకోవటం వల్ల శరీరంలో నిసత్తువ తొలగిపోయి యాక్టివ్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలసటను పోగొట్టి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. శరీరానికి విటమిన్-ఎ, విటమిన్-సి, బి-కాంప్లెక్స్, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ బాక్టీరియల్‌ను మింట్ టీ తాగటం వల్ల అందుతాయి. వేసవిలో కాలంలో ఎండ వేడి కారణంగా వచ్చే తలనొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు ఇది ఉపకరిస్తుంది. పుదీనా ఆకులలో మెంతోల్ ఉంటుంది. ఇది తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సాధారణంగా వేసవి సమయంలో జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతుంటాయి. వాటి నుండి బయటపడాలంటే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పుదీనా టీ తీసుకోవటం మంచిది. గ్యాస్, ఉబ్బరం , అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పుదీనాలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జలుబు, జలుబు, గొంతు , ఛాతీ బిగుతు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అధిక ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటి వాటివల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెరిగడంతోపాటు.. మెదడు పనితీరు బాగా మెరుగవుతుంది.

పుదీనా టీ తయారీ ;

ముందుగా మీరు 6-7 పుదీనా ఆకులను కడగి పెట్టుకోవాలి. కొన్ని నీటిని ఓ గిన్నెలో తీసుకుని అందులో ఈఆకులను వేసి బాగా మరగనివ్వాలి. తరువాత ఆనీటిని వడపోయాలి. అవసరమనుకుంటే అందులో ఓ స్పూను తేనెను, నిమ్మరసాన్ని వేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా పుదీనా టీని సిద్ధం చేసుకోవచ్చు.

 

×