Mint : ఆరోగ్యానికి ఔషధంగా పనిచేసే పుదీనా

శరీరానికి చల్లదనాన్ని కలిగించటంలో దోహదపడతాయి. రోజువారి ఆహారంలో కొద్దిపాటి పుదీనా ఆకులను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

Mint : ఆరోగ్యానికి ఔషధంగా పనిచేసే పుదీనా

Mint

Mint : పుదీనా ఆకులో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన పరిసరాల్లో సులభంగా పుదీనా లభ్యమౌతుంది. పుదీనాలో ఔషధగుణాలతో బాటు జీర్ణక్రియలు సక్రమంగా ఉండేందుకు ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయి. శరీరంలో చెడు బ్యాక్టీరియాను నాశనం చేయటంలో సహాయకారిగా పనిచేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో ఉపయోగపడుతుంది. పుదీనాలో విటమిన్ ఎ, సి,లు అధికం. శరీరానికి కావాల్సిన రాగి , పీచు, మాంగనీసు, పొటాషియం లభిస్తాయి. పుదీనా ఆకులో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

శరీరానికి చల్లదనాన్ని కలిగించటంలో దోహదపడతాయి. రోజువారి ఆహారంలో కొద్దిపాటి పుదీనా ఆకులను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పుదీనా తినడం ద్వారా అలెర్జీ సమస్యలు తగ్గుతాయి, అస్తమా సమస్య ఉన్నవారికి సైతం ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే వంటకాలలో పుదీనాను ఆకులను విరివిగా ఉపయోగిస్తుంటారు. నోటి దుర్వాసన పోగొట్టడంలో తోడ్పడుతుంది. పుదీనాను చట్నీగా చేసుకుని తినేందుకు ఎక్కవ మంది ఇష్టపడతారు. అంతే కాకుండా టీలలో కూడా పుదీనా ఆకులను వినియోగిస్తారు. వీటిని వాడటం వల్ల టీకి కమ్మని ఫ్లేవర్ వస్తుంది. మానసిక వత్తిడిని దూరం చేయటంతోపాటు రాత్రిళ్లు నిద్రపట్టేలా చేయటంలో పుదీనా ఆకులు ఉపయోగపడతాయి.

పుదీనాలో ఉండే మెంతాల్ గుణం జలుబు, గొంతులో గరగర వంటి వాటికి చక్కగా పనిచేస్తుంది. నోటి దుర్వాసన, శ్వాస సంబంధ సమస్యలు ఉన్న వారికి పుదీనా పరిష్కారం చూపుతుంది. కడుపు నొప్పికి పుదీనా ఆకులను తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మెదడు పనితీరును మెరుగుచేస్తుంది. పాలిచ్చే తల్లులు ఇది తినడం ద్వారా పాలుపట్టిన సమయంలో కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా ఆకులలో సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. జిడ్డు చర్మం ఉన్న వారికి వచ్చే మొటిమల సమస్యకు చక్కని పరిష్కారంగా తోడ్పడతాయి. చర్మంలో రక్త ప్రసరణను పెంచడంలో, చర్మంపై ముడుతలను పోగొట్టటంలో ఉపకరిస్తాయి.