Mixing Two Vaccines : మిక్సింగ్ వ్యాక్సిన్లు వేరియంట్లను అడ్డుకోగలవు!

మిక్సింగ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై పనిచేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా టీకాల కొరత ఎదురైనప్పుడు రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు.

Mixing Two Vaccines : మిక్సింగ్ వ్యాక్సిన్లు వేరియంట్లను అడ్డుకోగలవు!

Mixing Two Vaccines Seems To Be Working Well Who Scientist (1)

Mixing Two Vaccines : మిక్సింగ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై పనిచేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా టీకాల కొరత ఎదురైనప్పుడు రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా టీకా మొదటి డోసు అందిన తర్వాత రెండో డోసు ఒకే రకం వ్యాక్సిన్ కొరత ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో మొదటి డోసు ఒక వ్యాక్సిన్.. రెండో డోసు మరో వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దీర్ఘ రోగనిరోధక శక్తి పెరుగుతోందని, అలాగే కొత్త వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తున్నట్టు తెలుస్తోందని సౌమ్య అభిప్రాయపడ్డారు. ఇదివరకే ఒక డోసు టీకా ఇచ్చి టీకా కొరత కారణంగా రెండో డోసు ఇవ్వలేకపోయే దేశాలకు ఇదో మంచి అవకాశమని ఆమె అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు ప్రభుత్వాలు, మరోవైపు ఫార్మా కంపెనీలు సైతం వేరియంట్లకు చెక్ పెట్టేందుకు బూస్టర్ వ్యాక్సిన్ తయారీపై ఫోకస్ పెడుతున్నాయి. మిక్సింగ్ వ్యాక్సినేషన్ విధానం ద్వారా టీకా కొరత ఎదుర్కొనే దేశాలకు పెద్ద సాయంగా అవుతుందని సౌమ్య తెలిపారు. యూకే, స్పెయిన్, జర్మనీ నుంచి ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు రకాల కరోనా వ్యాక్సిన్లతో అధిక స్థాయిలో యాంటీబాడీలు, ఎక్కువ సంఖ్యలో తెల్త రక్త కణాలు ఉత్పత్తి అయి వైరస్ ను దీటుగా ఎదుర్కొంటాయని గమనించినట్టు ఆమె తెలిపారు. వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో జ్వరం, నొప్పితో పాటు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత అధికంగా ఉన్నట్లు గమనించామని తెలిపారు. మలేసియాలో కూడా ఆస్ట్రాజెనికా, ఫైజర్ బయోంటెక్ టీకాల కాంబినేసన్ వినియోగిస్తోంది.

ఇటీవలే ఆ దేశ మంత్రి ఒకరు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలిపారు. తాజాగా కరోనా మిక్సింగ్ వ్యాక్సిన్ కరోనా వేరియంట్లపై బాగా పనిచేస్తాయని  సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యలను కొంతమంది నిపుణులు కూడా సమర్థించారు. వేర్వేరు వ్యాక్సిన్ల మిక్సింగ్ టీకా తీసుకోవడం ద్వారా వారిలో అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు తయారవుతాయని, కొద్దిమందిలో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. మిక్సింగ్ వ్యాక్సిన్లతో ఆస్పత్రిలో,
ఐసీయూలో చేరకుండా అవసరం లేకుండా అడ్డుకోవచ్చునని అంటున్నారు.

ఏదిఏమైనా.. కొవిడ్ వ్యాక్సిన్ ప్రతి మూడు ఏళ్ల నుంచి ఐదేళ్లకు టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సైంటిస్టు సౌమ్య అభిప్రాయపడ్డారు. అసలు బూస్టర్ డోసును సిఫార్సు చేసేందుకు అవసరమైన డేటా అందుబాటులో లేదన్నారు. కరోనా, టీకాలకు సంబంధించి సైంటిఫిక్ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికీ కొన్ని దేశాలు తొలి డోసు కూడా ఇవ్వలేదన్నారు. ఈ పరిస్థితుల్లో బూస్టర్ డోసుపై యోచన చేయడం తొందరపాటు చర్యగా సౌమ్య పేర్కొన్నారు.