Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది

ఫోథోస్ అనే రసాయనిక నామమైన మనీ ప్లాంట్‌ను ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని పెంచుతూ ఉంటారు. ఇవి సహజంగానే గాలిని శుద్ధి చేస్తుంటాయని చెబుతుంటారు. విషాన్ని ఫిల్టర్​ చేసి... చక్కని శ్వాస అందిస్తుంది.

Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది

Money Pplant

Money Plant: ఫోథోస్ అనే రసాయనిక నామమైన మనీ ప్లాంట్‌ను ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని పెంచుతూ ఉంటారు. ఇవి సహజంగానే గాలిని శుద్ధి చేస్తుంటాయని చెబుతుంటారు. విషాన్ని ఫిల్టర్​ చేసి… చక్కని శ్వాస అందిస్తుంది. దీని నిర్వహణకు ఖర్చు తక్కువే. మనీ ప్లాంట్లను ఎల్లప్పుడూ సరైన దిశలో నాటాలి అంటుంది వాస్తు సిద్ధాంతం.

ఈశాన్య దిశలో నాటితే ఆర్థికంగా నష్టపోతారని అంటున్నారు. దీనికి తోడు ఇంట్లో ప్రతికూలత కూడా ఏర్పడుతుందట. ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. గణేశుడు ఈ దిశలో ఉండే దేవుడు కాబట్టి మంగళం సూచిస్తుంది. ఈ దిశలో మొక్కల పెంపకం ఆశీర్వాదాలను అందిస్తుంది.

Money plant వేగంగా పెరుగుతుంది. మొక్క తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించండి. Vastu సిద్ధాంత ప్రకారం.. పెరుగుతున్న తీగలు శ్రేయస్సుకు చిహ్నం. మనీ ప్లాంట్ లక్ష్మీ దేవి యొక్క రూపమని నమ్ముతారు. అదే భూమిని తాకకుండా ఉండటానికి కారణం. వాస్తు ప్రకారం, ఎండిన మనీ ప్లాంట్ దురదృష్టానికి చిహ్నం.

Read Also : మనీ ప్లాంట్ ఉందా..అయితే జాగ్రత్త

మనీ ప్లాంట్‌ (Money plant)కు రోజూ నీరు పోస్తూ ఉండండి. ఆకులు ఎండిపోతే, వాటిని కత్తిరించి తొలగించండి. మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచండి. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి దీనిని ఇంటి లోపల నాటుకోవచ్చు. మొక్క ఎదుగుదల మందగించడం అశుభం. ఇది ఆర్థిక లోటుకు కారణం అవుతుంది.

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌లను ఇతరులకు ఇవ్వకూడదు. ఇది శుక్ర గ్రహానికి కోపం తెప్పిస్తుంది. ఇలా చేయడం వల్ల పుణ్యాలు దూరమవుతాయి. వర్షాకాలంలో మొక్కల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చాలామంది మొక్కలు ఎక్కువగా ఉంచుకోరు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ మనీప్లాంట్​ను పెంచాలి.