Monsoon Diet : వర్షాకాలం వీటిని తినండి..రోగ నిరోధక శక్తి పెంచుకోండి

వర్షాకాలం వచ్చేసింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలోనే వ్యాధులు విజృంభిస్తుంటాయి. దీంతో అనారోగ్యానికి గురవుతూ..ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. మంచి పౌష్టికారం తీసుకోవాలని, రోగ నిరోధక పెంచే వాటిని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలంటున్నారు.

Monsoon Diet : వర్షాకాలం వీటిని తినండి..రోగ నిరోధక శక్తి పెంచుకోండి

Rain

Monsoon Diet Healthy Tips : వర్షాకాలం వచ్చేసింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలోనే వ్యాధులు విజృంభిస్తుంటాయి. దీంతో అనారోగ్యానికి గురవుతూ..ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. మంచి పౌష్టికారం తీసుకోవాలని, రోగ నిరోధక పెంచే వాటిని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలంటున్నారు. ఇవి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకుని రోగాల బారిన పడకుండా..ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

Health

వెల్లుల్లి : –
ప్రతి ఇంట్లో వెల్లుల్లి ఉండడం కామన్. కూరల్లో వీటిని వేస్తుంటారు. ఇవి తినడం వల్ల జీవక్రియను నియంత్రించడంలో వెల్లుల్లి చక్కగా ఉపయోగ పడుతుంది. వెల్లుల్లితో పాటు..మిరియాలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పసుపు వంటి మసాల దినుసులను రోజూ కూరల్లో వేసుకోవడం బెటర్. దీని కారణంగా..వర్షాకాలంలో వచ్చే జలుబు, ఇతరత్రా ఫ్లూ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

Health


పండ్లు : – 

వానకాలంలో వచ్చే పండ్లను తీసుకోవాలి. బొప్పాయి, లిచీ, యాపిల్, పియర్ వంటి పండ్లను తినడం ద్వారా..ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లు అందిస్తాయని, గ‌ట్ హెల్త్ అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.

Health

పెరుగు :-కొంతమంది పెరుగు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా వర్షాకాలంలో చల్లగా ఏమి తింటాం అని పక్కన పెడుతుంటారు. పెరుగును ఆహారంలో తీసుకోవడం ద్వారా..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంటుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.Health

తేనే : –
తేనే. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శక్తిని ఇస్తుంది. ఇందులో పైటోన్యూట్రియెంట్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గిస్తుంది.

Health

నీరు :
ప్రతి రోజు లేవగానే నీరు తాగాలని అంటుంటారు. పరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల…శరీరానికి శక్తినిస్తుంది. నీటిని శుభ్రం చేసుకుని తాగడం, వేడి చేసుకుని తాగాలి. నీళ్లలో నిమ్మ, దోసకాయ, పుదీన కలిపి తీసుకొంటే చాలా మంచింది.

Health


కాకారకాయ, మెంతి, వేప

కూరగాయల విషయానికి వస్తే..కాకరకాయ, మెంతిలను విరివిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంపొదించడంలో సహాయపడుతాయి. వీటిలో విట‌మిన్ ఏ, బీ, సీతో పాటు ఐర‌న్‌, జింక్ ఖ‌నిజాలు కూడా పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఇక వేప విషయానికి వస్తే..ఇందులో యాంటీ ఫంగ‌ల్‌, యాంటీబ‌యాటిక్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల…వ్యాధులతో పోరాటానికి సహాయ పడుతాయి.

Health

మెలకలు :
రోగ నిరోధకశక్తిని పెంచుకోవడంలో మొలకలు కూడా కీలక ప్రాత పోషిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కాపాడడంలో మొలకలు కీలకం. యాంటీఆక్సిడెంట్ల‌ను కూడా అందిస్తాయి. ఇవి శ‌రీరంలోని ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచ‌డం ద్వారా హానిక‌లిగించే వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తుంది.