Drumstick Leaves : పెరుగులో ఉండే ప్రొటీన్స్ కంటే మునగలో అధికమా!

కాలేయంలో చేరిన విషపదార్ధాలను బయటకు పంపటంలో, మూత్రాశయంలో రాళ్లను కరిగించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. మదుమేహంతో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర స్ధాయిలను సమతుల్యం చేయటంలో ఉపకరిస్తుంది.

Drumstick Leaves : పెరుగులో ఉండే ప్రొటీన్స్ కంటే మునగలో అధికమా!

Drumstick Leaves

Drumstick Leaves : మనం రోజు తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే కూరగాయల్లో ముగన ముఖ్యమైనది. మూడు వందల రకాల రోగాలను దూరం చేసే గుణం మునగలో ఉన్నాయి. అందుకే మునగాకును పోషకాల గనిగా చెబుతారు. 100 గ్రాముల మునగలో 6.7 గ్రాముల ప్రొటీన్స్, 13.4 గ్రాముల పిండి పదార్ధాలు ఉంటాయి.

శరీరానికి కావాల్సిన కాల్సియం 440 మిల్లీ గ్రాములు, ఐరన్ 200 మిల్లీ గ్రాములు, ఇతర సూక్ష్మ పోషకాలు 2.3 శాతం ఉంటాయి. వంద గ్రాముల మునగాకు తీసుకుంటే 97 క్యాలరీల శక్తి లభిస్తుంది. మునగాకులో బీటా కెరోటీన్, విటమిన్ సీ, మాంసకృత్తులు, ఇనుము, పొటాషియం అధికంగా ఉంటాయి. పెరుగులో కన్నా 80 శాతం అధికంగా పోషకాలు మునగలో లభిస్తాయి. మునగ ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లు, సాస్ లలో ఉపయోగించుకోవచ్చు.

కాలేయంలో చేరిన విషపదార్ధాలను బయటకు పంపటంలో, మూత్రాశయంలో రాళ్లను కరిగించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. మదుమేహంతో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర స్ధాయిలను సమతుల్యం చేయటంలో ఉపకరిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కీళ్లనొప్పులను తగ్గించే శక్తి మునగకు ఉంది. మునగాకును కూరల్లో కరివేపాకుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. నాడీ వ్యవస్ధను సవ్యంగా పనిచేసేలా చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును పోగొడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేరట్ కన్నా 4 రెట్ల విటమిన్ ఎ ఇందులో ఉండటం వల్ల కంటికి చాలా మంది. ఇంకా చెప్పాలంటే పాలకన్నా అధిక కాల్షియం మునగాకు ద్వారా లభిస్తుంది.