Mulberry Tea : రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గించే మల్బరీ టీ

నిజానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడే డియోక్సినోజిరిమైసిన్ అనే సమ్మేళనం మల్బరీ టీ లో ఉన్నందున ఈ టీ చక్కెర స్ధాయిలను తగ్గించేందుకు పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Mulberry Tea : రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గించే మల్బరీ టీ

Mulberry Tea

Mulberry Tea : మధుమేహం అనేది ఇటీవలి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల్లో ఒకటి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుండి పెద్దల వరకు అంతా దీని బారిన పడుతున్నారు. జీవనశైలి, ప్రాసెస్ చేసిన ఆహారాలు, నిద్ర అలవాట్ల, జన్యుపరమైన లోపాల కారణంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్తత్తి కాక చక్కెర స్ధాయిలు ప్రమాదకరమైన స్ధాయికి చేరుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయమం వల్ల చక్కెర స్ధాయిలను కొంత మేర నియంత్రించుకోవచ్చు. అయితే చక్కెర స్ధాయిలను నియంత్రించటంలో మల్బరీ టీ బాగా ఉపకరిస్తున్నట్లు పరిశోధకలు చెబుతున్నారు. సౌదీ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో మల్బరీ టీ తాగడం వల్ల తినడం ద్వారా వచ్చే చక్కెర స్ధాయిలు తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడైంది.

నిజానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడే డియోక్సినోజిరిమైసిన్ అనే సమ్మేళనం మల్బరీ టీ లో ఉన్నందున ఈ టీ చక్కెర స్ధాయిలను తగ్గించేందుకు పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మల్బరీ టీ ఆకులు పోస్ట్‌ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ పెరుగుదలను తగ్గేలా చేస్తాయి. టైప్-2 డయాబెటిస్ రోగులలో మల్బరీ టీ ద్వారా పోస్ట్‌ప్రాండియల్ హైపర్గ్లైసీమియా తగ్గింపు పై అధ్యయనం చేపట్టగా భోజనం తర్వాత మల్బరీ టీ తాగటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం మధ్య సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలో దాదాపు 20 మంది పాల్గొనేవారికి సాధారణ టీ ఇవ్వబడింది, వారిలో 28 మంది మల్బరీ టీ తాగారు. ప్లెయిన్ టీ మరియు మల్బరీ టీ తాగిన తర్వాత, మల్బరీ టీ తీసుకున్న వారిలో పిపిజి స్థాయిలలో గణనీయమైన మార్పు వచ్చినట్లు గుర్తించారు. మల్బరీ టీ వినియోగించిన 90 నిమిషాల తర్వాత పిపిజి స్థాయిలను అణిచివేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

గమనిక ; పైన ఇవ్వబడిన సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల నుండి సేకరించబడింది. ఈ సమాచారం కేవలం అవగాహన కల్పించటానికి మాత్రమే. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.