Eyesight: కంప్యూటర్, మొబైల్ స్క్రీన్స్ చూస్తున్నారా.. కొత్త వ్యాధి రావొచ్చు జాగ్రత్త!!

కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోవడం, చాలా పనులు ఆన్‌లైన్లో జరగడానికే ఏర్పాట్లు జరగడంతో ఎల్ఈడీ స్క్రీన్ చూసే సమయం గతంలో కంటే పెరిగింది.

Eyesight: కంప్యూటర్, మొబైల్ స్క్రీన్స్ చూస్తున్నారా.. కొత్త వ్యాధి రావొచ్చు జాగ్రత్త!!

Led Screening Eye

Eyesight: అలవాట్లు ఎలాంటివైనా జీవన విధానంపై ప్రభావం చూపిస్తాయి. కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోవడం, చాలా పనులు ఆన్‌లైన్లో జరగడానికే ఏర్పాట్లు జరగడంతో ఎల్ఈడీ స్క్రీన్ చూసే సమయం గతంలో కంటే పెరిగింది. కంప్యూటర్, మొబైల్, టీవీ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూస్తుండటంతో ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

‘ది లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్’లో ప్రచురితమైన అధ్యయనంలో రీసెర్చర్లు జనానికి పొంచి ఉన్న పెనుముప్పుపై హెచ్చరికలు జారీ చేశారు. ఈ అలవాటు వల్ల యువతలో ‘మయోపియా’ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకపోతే రాబోయే సంవత్సరాల్లో చాలా మంది ఇదే సమస్యతో బాధపడక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఇంతకు ముందు ఈ ప్రమాదం పెద్ద వయస్కులలోనే కనపడేది. ఇప్పుడు స్క్రీన్ సమయం పెరగడంతో తీవ్రమైన కంటి వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపిస్తుంది.

……………………………………. : ఎయిరిండియాను నడపడం అంత సులువేమీ కాదు..కష్టాలుంటాయి

సవివరంగా తెలుసుకునేందుకు సింగపూర్, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో మయోపియాపై హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు స్టడీ నిర్వహించారు. 3 నెలల నుంచి 33 సంవత్సరాల పిల్లలు, యువకుల కళ్లను పరీక్షించారు. అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది వ్యక్తుల స్క్రీన్ సమయం పెరిగినట్లు తెలిసింది. రీసెర్చ్ ఫలితాలను విశ్లేషించగా రీసెర్చర్లకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

స్మార్ట్ డివైజెస్ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల మయోపియా ప్రమాదం 30శాతం పెరిగినట్లు తేలింది. కంప్యూటర్లను అధికంగా వినియోగించడమే ఈ ప్రమాదానికి 80శాతం కారణం.

……………………………………: అలయ్ బలయ్, బండి సంజయ్‌తో మాట్లాడిన కవిత..ఫొటో వైరల్

మయోపియా Myopiaతో సమస్య:
కంటి వైద్య నిపుణుల ప్రకారం.. మయోపియా సమస్యతో రోగి దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారు. దూర వస్తువులను చూడలేరు. ఫలితంగా కంటి ఆకృతి మారుతుంది.

2050 సంవత్సరం నాటికి, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి మయోపియా ప్రమాదం పొంచి ఉందని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ARU)లోని విజన్ అండ్ ఐ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్ బౌర్న్ పేర్కొన్నారు.