ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రాధాన్యత

భారతీయులు జరుపుకునే పండుగలు ఆనందాన్నే కాదు మనసుకు ఆహ్లాదాన్ని..శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే మన పండుగల్లోనే విశిష్టత.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 08:35 AM IST
ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రాధాన్యత

భారతీయులు జరుపుకునే పండుగలు ఆనందాన్నే కాదు మనసుకు ఆహ్లాదాన్ని..శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే మన పండుగల్లోనే విశిష్టత.

భారతీయులు జరుపుకునే పండుగలు ఆనందాన్నే కాదు మనసుకు ఆహ్లాదాన్ని..శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే మన పండుగల్లోనే విశిష్టత. వసంత మాసంలో వచ్చే మన ఉగాది పండుగలో మరిన్న విశేషాలు ఉన్నాయి. ఆరోగ్యం..జీవిత సూత్రాలను తెలియజేస్తుంది మన ఉగాది పండుగ. ఆ పండుగలో ప్రధానమైనది ‘వేపపువ్వు’. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్య ప్రధాయినిగా చెబుతుంది మన ఆయుర్వేద శాస్త్రం. 
Read Also : ఉగాది అంటే ఏమిటి.. ఎలా జరుపుకోవాలి?

జీవితంలోని సుఖదుఖాలకు సంకేతంగా ఉగాది పచ్చడి ఉంటుంది అని చెబుతారు ఎన్నో అనుభవాలను చవిచూసిన మన పెద్దలు.  తీపి ఆనందానికి ప్రతీక అయితే బాధలు చేదుని సూచిస్తాయి. ఇలానే ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కో రుచికి ఓక్కో అర్థం ఉంటుంది. అంతేకాదు దీని వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. ఉగాది పచ్చడిలో ‘వేపపువ్వు’ ప్రత్యేకతే వేరు.

ఆరోగ్యాల మెండు వేపపువ్వు  
ఆయుర్వేదంలో వేపకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వేపచెట్టు ఆకుల నుంచి, పండ్లు, బెరడు, పుల్లలు ఇలా ఆ చెట్టు ఓ ఆరోగ్య ప్రదాయిని అంటారు ఆయుర్వేద నిపుణులు. వసంత కాల సమయంలో వేప పూత పూస్తుంది. ఆ పువ్వుని ఉగాదిపచ్చడిలో వేస్తారు. ఈ వేపపువ్వులో చిరు పరిమళంతో పాటు ఉగాది పచ్చడికి మంచి  రంగును కూడా ఇస్తుంది. పచ్చడిలో వేపుపువ్వు త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వేపపువ్వులోని ఔషదాలు ఈ కాలంలో కడుపులో వచ్చే నులిపురుగులను హతమారుస్తాయి.  

అంతేకాదు  వేపని ఉపయోగించడంవల్ల కాలం మారే సమయంలో వచ్చే అంటువ్యాధులు, కామెర్లు వంటి వైరస్ ని వ్యాపించే  వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాదు వేపపువ్వు  శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే వేప ఓ చక్కని టీకాల పనిచేస్తుంది. అందుకే ఉగాది పచ్చడిలో వేపపూత ప్రాధాన్యత తెలిసినవ వారు వేపపువ్వుని తినకుండా ఎలా ఉండగలరు. అందుకే వేపపువ్వు తినండి..ఆరోగ్యంగా ఉండండి. 
Read Also : బాధలు పోతాయి : ఈ శ్లోకం చదువుతూ ఉగాది పచ్చడి తినాలి