Winter Allergies : చలికాలంలో వచ్చే అలర్జీలకు మంచి మందు వేపాకు!

లేత వేపాకులు ముద్దగా నూరి దానికి పసుపు , నువ్వుల నూనె చేర్చి సమస్య ఉన్న చోట లేపనంగా పూసుకోవాలి. ఇలా చేస్తే అలర్జీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

Winter Allergies : చలికాలంలో వచ్చే అలర్జీలకు మంచి మందు వేపాకు!

Neem is a good medicine for winter allergies!

Winter Allergies : చలికాలంలో అలర్జీలు ప్రధాన సమస్య. చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తుంటాయి. కొన్ని రాకాల ఆహారపదార్ధాలకు తోడు వాతావరణంలో మార్పుల కారణంగా అలర్జీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్ధితుల్లో చర్మం అతిగా స్పందించి చిక్కులు ఎదురవుతాయి. ఆహారపదార్ధాలు, సౌందర్య ఉత్పత్తులు, గాలి ద్వారా వచ్చే దుమ్ము, ధూళి, పొగ, పుప్పొడి , ఫంగస్, ఎండ వంటివి అలర్జీలకు ముఖ్యకారణాలు.

ఒక్కొకరికి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరికి కొన్ని పదార్ధాలు అసలు సరిపడవు. అలాంటి సందర్భంలో చర్మంపై దద్దురులు, పొక్కులు, ఎర్రటి మచ్చలు, పొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది.

అలర్జీలు ఉత్పన్నం అయితే ;

1. అలర్జీ సమస్యలు పదేపదే ఎదుర్కొంటుటే అందుకు కారణం తెలుసకునేందుకు ప్రయత్నించాలి. ఏదైనా ఆహారం తిన్నప్పుడు సమస్య ఉత్పన్నం అయిందని గుర్తిస్తే అలాంటి పదార్ధాలను తినకుండా మానేయటం మంచిది.

2. జుట్టుకు వేసుకునే రంగులను మానుకోవటం మంచిది. రోజుకు 8 గ్లాసుల నీరు ఖచ్చితంగా తీసుకోవాలి.

3. ఒక గ్లాసు పచ్చి కూరగాయల రసం తీసుకోవాలి. టొమాటో, క్యారెట్, కీరదోస, నిమ్మరసాల్లో ఏదో ఒకటి తీసుకోవటం మంచిది.

4. కారం , మసాల ఆహారాలు తగ్గించుకోవాలి. ఇవి త్వరగా జీర్ణం కావు. మెంతులు, మెంతి కూర, కాకరకాయ, గోరు చిక్కుడు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

అలర్జీల నుండి ఉపశమనానికి వేపాకుతో ;

1. లేత వేపాకులు, తులసి ఆకులు సమానంగా తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటికి నీటిని కొద్ది మొత్తం చేర్చి మెత్తగా నూరుకుని రసం తీయాలి. ప్రతిరోజు 30 మి.లీ. పరిమాణంలో ఈ రసాన్ని తీసుకుంటే చర్మంపై వచ్చే అలర్జీలు తగ్గుముఖం పడతాయి.

2. వేపనూనెను నిత్యం అలర్జీ వచ్చి ప్రాంతాల్లో రాస్తుంటే సమస్య నుండి బయటపడవచ్చు.

3. లేత వేపాకులు ముద్దగా నూరి దానికి పసుపు , నువ్వుల నూనె చేర్చి సమస్య ఉన్న చోట లేపనంగా పూసుకోవాలి. ఇలా చేస్తే అలర్జీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.