Neurosciences: హెడ్‌బ్యాండ్‌‌తో టెన్షన్స్ మాయం.. ఈజీగా నిద్ర పట్టి, మెదడు బాగా పనిచేస్తుంది

శరీరానికి CPU వంటి మెదడు.. సమర్థవంతంగా పనిచేయాలంటే విశ్రాంతి చాలా ముఖ్యం.

10TV Telugu News

Neurosciences: శరీరానికి CPU వంటి మెదడు.. సమర్థవంతంగా పనిచేయాలంటే విశ్రాంతి చాలా ముఖ్యం. నిద్రపోతున్నప్పుడు కూడా మెదడు కొన్నిసార్లు మేల్కొంటుంది. కానీ మెదడుకు విశ్రాంతి చాలా అవసరం. మనం నిద్రపోతున్నప్పుడు, కణాల నుంచి వచ్చే వ్యర్థాలను శుభ్రపరిచి ప్రసరణ వ్యవస్థ ద్వారా బయటకు పంపుతాయి. మెదడుని శుభ్రపరచి శరీర పనితీరును మెరుగుపరిచి, రీ-సెట్ బటన్ కొట్టినట్లుగా మనస్సులను పునరుద్ధరించడానికి నిద్ర బాగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవన విధానంలో ఒరెగాన్-ఆధారిత న్యూరోసైన్సెస్ స్టార్ట్-అప్ బాగా నిద్ర పోయేందుకు ఉపయోగపడే ఓ హెడ్‌బ్యాండ్‌ను తయారుచేసింది. GeekWire నివేదిక ప్రకారం.. ఈ హెడ్ బ్యాండ్‌తో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ద్వారా USD 4.3 మిలియన్ల విలువైన నిధులు సమకూర్చుకుని ప్రాజెక్ట్‌లో 90మంది వ్యక్తులపై ఈ కొత్త హెడ్‌బ్యాండ్‌ను పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే, నిద్ర, విశ్రాంతి, మానసిక ఆందోళనలకు భవిష్యత్తులో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.

హెడ్‌బ్యాండ్ బాగా నిద్రపోయేలా చేసి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది సహజ ప్రక్రియల్లో మెదడును శుభ్రపరుస్తుంది. హెడ్‌బ్యాండ్ మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను కొలుస్తుంది. విశ్రాంతి ప్రక్రియను ప్రేరేపించి, నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఈ పరీక్ష విజయవంతమైతే, నిద్ర రికవరీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాలక్రమేణా మెదడు పనితీరును క్షీణింపజేసే నిద్రలేమి, నిరాశ, ఆందోళన ఇతర మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్న వ్యక్తుల చిక్కులను తగ్గిస్తాయి.