Swallowing Tablets : టాబ్లెట్స్ మింగే సమయంలో ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

ఇతర ద్రవాలతో కలపి ట్యాబ్లెట్స్‌ వేసుకుంటే అవి స‌రిగ్గా క‌ర‌గ‌వు. అదేవిధంగా ట్యాబ్లెట్ల‌లో ఉండే మందును శ‌రీరం గ్రహించదు. ఫ‌లితం గా టాబ్లెట్ వేసుకున్నాకూడా అనారోగ్యం నయం కాదు. కనుక ఎవ‌రైనా ట్యాబ్లెట్ల‌ను వేసుకోవాలనుకున్నప్పుడు తప్పని సరిగా గోరు వెచ్చ‌ని నీటి నే తాగాలి.

Swallowing Tablets : టాబ్లెట్స్ మింగే సమయంలో ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

Swallowing Tablets : అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటారు చాలా మంది. ఐతే మంచినీళ్లతో మందు బిళ్లలు వేసుకుంటే ఫర్వాలేదు. అలాకాకుండా కాఫీ తాగుతూ,టీ తాగుతూ, జ్యూస్ లు తాగుతూనో ఇలా ర‌క‌ర‌కాల ద్రవపదార్ధాలతో ట్యాబ్లెట్ల‌ను వేసేసుకుంటుంటారు. అయితే తెలియక చేసే ఆ చిన్న‌ పొర‌పాటు ఆరోగ్యం పై తీవ్రమైన ప్ర‌భావం చూపుతాయి.

ఇతర ద్రవాలతో కలపి ట్యాబ్లెట్స్‌ వేసుకుంటే అవి స‌రిగ్గా క‌ర‌గ‌వు. అదేవిధంగా ట్యాబ్లెట్ల‌లో ఉండే మందును శ‌రీరం గ్రహించదు. ఫ‌లితం గా టాబ్లెట్ వేసుకున్నాకూడా అనారోగ్యం నయం కాదు. కనుక ఎవ‌రైనా ట్యాబ్లెట్ల‌ను వేసుకోవాలనుకున్నప్పుడు తప్పని సరిగా గోరు వెచ్చ‌ని నీటి నే తాగాలి.

నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం తటస్థీకరిస్తుంది. కనుక అలా చేయరాదు.

అదేవిధంగా ద్రాక్ష రసం తో కూడా ట్యాబ్లెట్లను వేసుకోకూడ‌దు. ద్రాక్షరసంలోని ఎంజైములు ట్యాబ్లెట్ల ప్రభావాన్నిపూర్తిగా తగ్గించేస్తాయి. దీని కారణం గా అనారోగ్యం తగ్గదు. ఇది మాములు టాబ్లెట్స్ ప్రభావాన్ని కూడా పెంచి హాని కలిగిస్తాయి. టీ తాగుతూ ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. దానికి గల కారణం పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గేలా చేస్తుంది.

పాల ఉత్పత్తులు శరీరంలో విభిన్నమైన ప్రక్రియలకు కారణమవుతాయి. కొందరు నిద్రపట్టేందుకు మాత్రలు వేసుకుంటుంటారు. అలాంటివారు ఆ స్లీప్ మెడిసిన్‌తో డార్క్ చాక్లెట్ తినకూడదు. ఈ చాక్లెట్ నిద్రపోయే ఔషధాన్ని పూర్తిగా తటస్థీకరిస్తుంది. ఫలితంగా రక్తపోటు బాగా పెరుగుతుంది. పీచు తో కూడిన పళ్ళరసాలు, కూర‌గాయ‌లు పళ్ళు కలిపి తీసిన ప‌ళ్ల‌ రసాల తో ట్యాబ్లెట్ల‌ను వేసుకోకూడదు. ఇలా వేసుకోవడం వ‌ల్ల బీపీ, షుగ‌ర్ వంటి మందులు పనిచేయవు. పండ్లరసాలు ఔషధ గుణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.