New Car Smell: కొత్త కారు వాసన హెల్త్‌కు చాలా డేంజర్

యూజర్లు కొత్తదనం ప్రత్యేకత ఉండాలని అనేక కార్ పర్ ఫ్యూమ్స్ వాడటం వల్లనే ఇలా జరగొచ్చు. అంతేకాకుండా కొత్త కార్ లో..

New Car Smell: కొత్త కారు వాసన హెల్త్‌కు చాలా డేంజర్

New Car Smell

New Car Smell: మనకు కొత్త వస్తువులంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే వాటి వాసన కూడా. ఇక కొత్త కార్లు అయితే వాటి లుక్ తో పాటు వాసన అంటే కూడా ముక్కులు కాస్త పెద్దది చేసుకుని మరీ గాలి పీలుస్తాం. కొన్నందుకు సంతృప్తిగా ఉన్నా.. ఆ వాసన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఓ స్టడీ చెప్తుంది.

ఎందుకంటే చాలా మంది యూజర్లు కొత్తదనం ప్రత్యేకత ఉండాలని అనేక కార్ పర్ ఫ్యూమ్స్ వాడటం వల్లనే ఇలా జరగొచ్చు. అంతేకాకుండా కొత్త కార్ లో చాలా కెమికల్స్ వాసన కూడా వస్తుంది. ఫ్యాబ్రిక్స్, ఫోమ్స్, సాల్వెంట్స్, రబ్బర్స్, ప్లాస్టిక్ వంటి వాటిని తయారుచేసే క్రమంలో వాడే కెమికల్స్ వాసనే ఇది.

వీటన్నింటిలో వీఓసీలు లేదా ఆర్గానిక్ కాంపౌండ్ల మిశ్రమం కచ్చితంగా ఉంటుంది. అవన్నీ సరైన క్వాంటిటీలోనే ఉంటాయని అలేఖ్య రేద్దాం, డేవిడ్ సీ జరిపిన సర్వేలో తేలింది. కార్ తయారుచేసిన పదార్థాల వాసనకు సూర్యుని ఎండ వల్ల వచ్చే వేడి రెట్టింపు ప్రభావం కనిపిస్తుంది.

ఫార్మాల్డిహైడ్, ఇథైల్ బెంజీన్, టొల్యూన్ లాంటి హానికారక కెమికల్స్ వాసనలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. నెయిల్ పాలిష్ రిమూవర్, కరెక్షన్ పెన్స్, పెయింట్, గ్లూ లాంటి వాసనలను ఇవి పోలి ఉంటాయి. వీటి వల్ల ఆల్రెడీ మనం అలర్జీలు, తలనొప్పులు, వాంతులు, నీరసం లాంటివి కొద్ది మందిలో చూసే ఉంటాం. ఈ కెమికల్స్ వాసనలననీ కార్సినోజెనిక్స్ వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాలిఫోర్నియాలోని ఆరోగ్య సంస్థ కన్ఫామ్ చేసింది.

ఎకాలజీ సెంటర్ జరిపిన స్టడీలో .. కొత్త కార్ల వాసన హానికరం. చాలా అనారోగ్యాలకు కారణం అవ్వొచ్చు. జనన సమస్యలకు దారి తీయొచ్చు. నేర్చుకునే లక్షణం కోల్పోవచ్చు. క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని తేలింది.

మునిచ్ టెక్నికల్ యూనివర్సిటీ ఎయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసింది. సూర్యుని ఎండలో కార్ ఉన్నప్పుడు అందులో కూర్చొన్న వ్యక్తిపై పడే గాలి శాంపుల్స్ ను సేకరించింది. వాటికి సంబంధించిన ఫలితాల్లో చాలా ప్రమాదకరం అని తేలింది.