UK Bats : యూకే గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ఇది మనుషుల్లో వ్యాపిస్తుందా?

ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒకవైపు కరోనా వేరియంట్లతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు మరో షాకింగ్ న్యూస్.. యూకే గబ్బిలాల నుంచి కొత్త కరోనావైరస్ ఉద్భవించినట్టు పరిశోధకులు కనుగొన్నారు.

UK Bats : యూకే గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ఇది మనుషుల్లో వ్యాపిస్తుందా?

New Coronavirus Found In Uk Bats

New coronavirus found in UK bats : ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒకవైపు కరోనా వేరియంట్లతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు మరో షాకింగ్ న్యూస్.. యూకే గబ్బిలాల నుంచి కొత్త కరోనావైరస్ ఉద్భవించినట్టు పరిశోధకులు కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. కరోనా పుట్టుకకు ఇప్పటివరకూ మూలం ఎక్కడనేది స్పష్టంగా తెలియదు. కానీ, కొవిడ్ -19కి కారణమయ్యే వైరస్‌ మాదిరిగానే ఈ కొత్త కరోనావైరస్ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు మానవులకు వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

ఈ కొత్త కరోనావైరస్‌కు RhGB01 అని పేరు పెట్టారు రీసెర్చర్లు. యూకేలో మొదట ఈ కరోనావైరస్ కనుగొన్నారు. అధ్యయనం ప్రకారం.. ఈ కొత్త కరోనావైరస్ వాహకాలుగా కొన్నేళ్లుగా హామర్ హెడ్ గబ్బిలాల (hammerhead bats) తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో గబ్బిలాలపై రీసెర్చ్ ఎప్పుడూ జరగలేదు. ఇటీవలే ఈ కొత్త కరోనాను గుర్తించారు పరిశోధకులు.

గబ్బిలాల్లోని ఈ రకం కొత్త కరోనావైరస్.. ఇప్పటికీవరకు మనుషుల్లో వ్యాపించలేదు. వైరస్ కాలక్రమేణా ముట్యుట్ అవుతుంటుంది. తద్వారా భవిష్యత్తులో ప్రజలకు సోకే అవకాశం లేకపోలేదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి కొత్త వైరస్ సోకిన గబ్బిలాలతో లేదా కోవిడ్-19తో డ్రాప్ లెట్స్ తో సంబంధం కలిగి ఉంటే.. మ్యుటేషన్ అయ్యే అవకాశం ఉంది. వైరస్ సోకిన గబ్బిలాలతో సంబంధం ఉన్నట్లయితే.. వెంటనే అవసరమైన నివారణ చర్యలు చేపట్టడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ కొత్త కరోనా వైరస్‌ను మోసుకెళ్లే.. ఈ రకం గబ్బిలాలు సాధారణంగా దక్షిణ అమెరికాలో కనిపించవు.

పరిశోధనల ప్రకారం.. ఆసియా, యూరప్, ఆఫ్రికా ఓషియానియాలోని దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రస్తుత కరోనావైరస్‌కు కారణమైన SARS-CoV-2 అనేది.. 2003లో SARS వ్యాప్తికి కారణమైన SARS-CoVతో దగ్గరి సంబంధం ఉందని పలు నివేదికల్లో తేలింది. సబ్జెనస్ సర్వెకోవైరస్‌ల (sarvecoviruses) గ్రూపులో ఈ రకం కొత్త వైరస్ కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 53 గబ్బిలాలపై జరిపారు. గబ్బలాల మలాన్ని సేకరించి పరీక్షలు జరిపారు. అనంతరం ఫలితాల్లో కొత్త కరోనావైరస్ ఉందని పరిశోధకులు తేల్చేశారు.