ఈ కొంటె కోతులకు ఫోన్లు దొంగిలించడం ఇష్టం.. టూరిస్టులతో డీల్.. బదులుగా ఏదైనా ఇస్తేనే తిరిగి ఇస్తాయి!

ఈ కొంటె కోతులకు ఫోన్లు దొంగిలించడం ఇష్టం.. టూరిస్టులతో డీల్.. బదులుగా ఏదైనా ఇస్తేనే తిరిగి ఇస్తాయి!

monkeys spot high-value items to ransom : అదో పురాతన కోతుల నగరం.. అక్కడ కోతులదే రాజ్యం.. పురాతనమైన ప్రదేశమైన బాలిలో ఉలవటు అనే ఆలయం ఉంది. ఇక్కడే పొడవైన తోక కలిగిన కోతులు చరిస్తుంటాయి. అక్కడకు వచ్చే పర్యాటకులను ఆటపట్టిస్తుంటాయి. సరదా కోసం కాదండోయ్.. ఆకలి కోసమే.. వచ్చేటూరిస్టులు ఉత్తచేతులత్తోవస్తే ఊరుకోవు.. ఏదో ఒకటి ఆహారం తీసుకురావాలి? అదే కోతుల డీల్.. లేదంటే.. టూరిస్టుల ఏదో ఒక వస్తువును దొంగిలిస్తాయి.
తమకు ఏదైనా ఆహారాన్ని అందించేంతవరకు టూరిస్టులకు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి ఇవ్వవు. అందులోనూ ఆ కోతులు ఖరీదైన వస్తువులనే టూరిస్టుల నుంచి ఎత్తుకెళ్తుంటాయి. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, విలువైన వస్తువులే టార్గెట్. వస్తువుల విలువను బట్టి డిమాండ్ చేస్తుంటాయి. పర్యాటకుల నుంచి హెయిర్ పిన్‌లు లేదా ఖాళీ కెమెరా బ్యాగ్‌లు వంటివి అసలే పట్టించుకోవు. ఈ కోతులు తెలివిగా ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులే టార్గెట్ చేస్తుంటాయని కెనడాలోని లెత్‌బ్రిడ్జ్ యూనివర్శిటీలో సైకాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీన్-బాప్టిస్ట్ లెకా అన్నారు.
మొబైల్ ఫోన్లు, పర్సులు, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోతులు దొంగిలించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి. ఈ కోతులు పర్యాటకుల నుంచి విలువైన వస్తువులను లాక్కోవడంలో తెలివిగా వ్యవహరిస్తాయి. మరోవైపు విలువైన వస్తువుల విషయంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ సిబ్బంది కూడా సూచిస్తుంటారు. జిప్ పెట్టిన హ్యాండ్‌బ్యాగుల లోపల వస్తువులను ఉంచాలని సూచిస్తుంటారు. కోతులు, ఆలయ సందర్శకుల మధ్య పరస్పరం చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. అధిక విలువైన వస్తువులకు కోతులు మంచి బహుమతులను అందిస్తుంటారు. వస్తువును బట్టి ఎక్కువ ఆహారం డిమాండ్ చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. కోతి దొంగ, పర్యాటకుడు, ఆలయ సిబ్బంది మధ్య బేరసారాలు కొనసాగాయి.
ఒక వస్తువు తిరిగి ఇవ్వడానికి ముందు 25 నిమిషాలు వేచిచూడాలి. ఇందులో 17 నిమిషాల చర్చలే కొనసాగుతాయింట. తక్కువ-విలువైన వస్తువుల కోసం కోతులు తక్కువ ఆహారాన్ని అంగీకరిస్తాయంట. అలా వస్తుమార్పిడి చేసుకున్నాకే వదిలిపెడతాయంట.. కోతి ప్రవర్తనలు ఇలా సామాజికంగా నేర్చుకున్నవే అంటున్నారు. ఈ జనాభాలో కనీసం 30 ఏళ్ల కోతుల తరాల నుండి కొనసాగుతూ వస్తోంది. కొన్ని ప్రాంతాలలో, కోతులు మరింత దూకుడుగా మారాయని చెబుతున్నారు. థాయ్‌లాండ్‌లో, మకాక్ కోతుల జనాభాకు ప్రసిద్ధి చెందిన లోప్‌బురి నగరంలో గత ఏడాది అధికారులు కోతులను శానిటైజేషన్ చేయడం ప్రారంభించారు. మహమ్మారి సమయంలో పర్యాటకులు లేకపోవడం వల్ల కోతులన్నీ ఆకలితో అలమటించాయని అంటున్నారు.