Potato : ఆహారంగానే కాదు…చర్మ సౌందర్యానికి!…

చర్మ సౌందర్యాన్ని బంగాళ దుంప మెరుగుపరుస్తుంది. కళ్ల క్రింద నల్లని వలయాలతో ఇబ్బంది పడుతున్న వారికి బంగాళ దుంప రసం బాగా ఉపకరిస్తుంది.

Potato : ఆహారంగానే కాదు…చర్మ సౌందర్యానికి!…

Potato

Potato : కూరగాయల్లో బంగాళ దుంపది ప్రత్యేక స్ధానం. పిల్లల నుండి పెద్దల వరకు బంగాళ దుంప కూరను చాలా ఇష్టంగా తింటారు. బంగాళ దుంపల్లో పిండిపదార్ధాలు, కార్బోహైడ్రేట్లు, పీచు, కొవ్వు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పాల్సరస్, పొటాషియం, సోడియం, ఇనుము వంటి ఖనిజాలు ఉన్నాయి. అంతేకాకుండా నియాసిన్, విటమిన్ బి6, సి, రైబోఫ్లావిన్, ధయామిన్ వంటివి పుష్కలంగా లభ్యమౌతాయి.

బంగాళ దుంపను సాధ్యమైనంత వరకు ఉడియించుకుని తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా నూనెలో ఫ్రై చేసుకుని చిప్స్ రూపంలో తినటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. బంగాళ దుంపకు నూనె ఎక్కువగా పీల్చే గుణం ఉండటం వల్ల ఫైలు గా చేసుకుని తినటం వల్ల శరీరంలోకి కొవ్వులు అధిక మోతాదులో చేరే అవకాశాలు ఉంటాయి. బంగాళ దుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగాలనుకునే వారికి ఇదొక మంచి ఆహారంగా చెప్పవచ్చు.

చర్మ సౌందర్యాన్ని బంగాళ దుంప మెరుగుపరుస్తుంది. కళ్ల క్రింద నల్లని వలయాలతో ఇబ్బంది పడుతున్న వారికి బంగాళ దుంప రసం బాగా ఉపకరిస్తుంది. బంగాళ దుంప రసాన్ని నలుపు భాగంలో రాయటం వల్ల నల్లని వలయాలు తొలగిపోతాయి. ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు వంటివి తొలగిపోతాయి. చర్మంపై ముడతలు పోగొట్టటంలో చక్కగా ఉపయోగపడుతుంది. చర్మంపై మృతకణాలను పోగొడుతుంది.

బంగాళాదుంపల కన్నాదానిపైన ఉండే పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. క్యారెట్లలో ఉన్న విటమిన్ ఎ కన్నా ఈ పొట్టులో ఉంటే విటమిన్ ఎ శాతమే అధికం.కండి చూపును మెరుగుపరిచేందుకు ఇది సహాయపడుతుంది. విటమిన్ సి, బి తొక్కలో ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలు త్వరగా రావు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక బరువు కూడా తగ్గచ్చు. బంగాళాదుంపల తొక్కల్లో సొలనైన్ అనబడే విషపదార్థం ఉంటుంది. ఎక్కువ మోతాదులో పొట్టు తింటే ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.