Black Tea : ఒత్తిడి తగ్గించటమే కాదు, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటం లో సహాయపడే బ్లాక్ టీ! ప్రయోజనాలు తెలిస్తే?

డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది.

Black Tea : ఒత్తిడి తగ్గించటమే కాదు, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటం లో సహాయపడే బ్లాక్ టీ! ప్రయోజనాలు తెలిస్తే?

BLACK TEA

Black Tea : టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే టీ తాగందే ఏపని చేయలేరు. టీ అనగానే పాలు, పంచదార కలుపుకుని తాగటం కాకుండా బ్లాక్ టీ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు కప్పుల మోతాదులో బ్లాక్ టీ తీసుకోవటం వల్ల అనే ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీతో పోల్చుకుంటే బ్లాక్ టీలో చాలా తక్కువ మోతాదుతులో కెఫిన్ ఉంటుంది.

బ్లాక్ టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

1. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బ్లాక్ టీ తాగటం వల్ల బరువు సమస్య నుండి బయటపడవచ్చు. బ్లాక్ టీ తాగటం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగుతుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా జీర్ణక్రియ రేటు పెరుగుతోంది. తద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుంది.

2. బ్లాక్ టీలో కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది కణాల ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు మన శరీరంలో వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ ప్లాంట్‌లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనాలు కనిపిస్తాయి. ఇవి మన శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

3. బ్లాక్ టీ క్యాన్సర్‌తో సంబంధం ఉన్న సమ్మేళనాలు, కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు బ్లాక్ టీ ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

4. బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఈజీగా తగ్గుతాయి. బ్లాక్‌ టీలోని పాలీఫినోల్స్‌ మెటబాలిజమ్‌ పెరగడానికి తోడ్పడుతుంది.

5. బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్‌ అనే యాంటాక్సిడెంట్‌ రొమ్ము కేన్సర్‌ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తుంది. వివిధ రకాల క్యాన్సర్లు దరిచేరకుండా నిలవువరించేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా పెద్దపేగు, ఉపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిలిపివేసే శక్తి బ్లాక్ టీకి ఉంటుంది. రోజుకు ఒక కప్పు బ్లాక్ టీ సేవించటం మంచిది.

6. డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. ఆస్తమా నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

7. గుండె జబ్బులతో బాధపడుతున్న వారు రోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగటం చాలా మంచిది. కరోనరీ ఆర్టేరీ డిస్-ఫంక్షన్స్ తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉన్న వారు బ్లాక్ టీ తాగినా గుండె జ‌బ్బులు దరిచేరకుండా చూసుకోవచ్చు.

8. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. బ్లాక్ టీలో ఉన్న ఎమైనో యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

9. బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్ఎముకలు గట్టిపడడానికి దోహదం చేస్తాయి.. బ్లాక్ టీ తాగేవారిలో ఎముకలు గట్టిపడటంతోపాటు ఆరోగ్యంగా ఉంటాయి.

బ్లాక్ టీ తయారీ విధానం ;

ముందుగా నిమ్మరసం 2 టీ స్పూన్లు, నీళ్ళు 2 కప్పులు, టీ పొడి 11/2 టీ స్పూన్ తీసుకోవాలి. నీళ్ళు మరగనిచ్చి టీ పొడి వేసి మూత పెట్టి 2 నిమిషాల బాగా మరగనివ్వాలి. తరువాత కప్పులో వేసి నిమ్మరసం కొద్దిగా వేసి అలా రెండు కప్పుల టీ చేసి నిమ్మరసం వేసి తాగితే చాలా మంచిది.

బ్లాక్‌లో లాభాలు మాత్రమే కాదు. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బ్లాక్ టీలో కెఫిన్ ఉంటుంది. ఎక్కువగా కెఫీన్ తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి, వేగవంతమైన హృదయ స్పందన రేటు, నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సమస్యలు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. బ్లాక్ టీని పరిమిత పరిమాణంలో తీసుకుంటే మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.