కోవిడ్ -19 ఔషధంపై బయోటెక్, బీ-ఫార్మసీ స్టూడెంట్స్ రీసెర్చ్

  • Published By: sreehari ,Published On : July 7, 2020 / 03:07 PM IST
కోవిడ్ -19 ఔషధంపై బయోటెక్, బీ-ఫార్మసీ స్టూడెంట్స్ రీసెర్చ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కరోనా తీవ్రత కూడా ఎక్కువ అవుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోసం విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించి దేశంలోని ప్రొఫెషనల్స్, టీచర్లు, రీసెర్చర్లు, బయోటెక్నాలజీ, మెడిసిన్, ఫార్మసీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ రంగాలకు చెందిన బయోటెక్, బీ ఫార్మసీ విద్యార్థులు ఈ పరిశోధనలో డ్రగ్ తయారీ ప్రక్రియలో తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ బారినపడి 17,800 వరకు మరణించారు. దేశంలో 2,26,947 మంది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

‘ఏదైనా ఒక  ఔషధంపై పరిశోధన చేయడమనేది చాలా కష్టమైనది.. ఖరీదైన ప్రక్రియ కూడా. ఈ ప్రక్రియను తక్కువ వ్యవధిలో తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చునని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి Ramesh Pokhriyal Nishank అన్నారు. కోవిడ్ -19ను వైరస్‌ను ఎదుర్కోవటానికి ఔషధాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ఇందు కోసం, HRD మంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ సంయుక్తంగా డ్రగ్ డిస్కవరీ హాకథాన్‌ను ప్రారంభించారు.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఉన్నాయి. ఈ హాకథాన్ మూడు ట్రాక్‌లలో పూర్తి అవుతుంది. తొలి ట్రాక్ SARS-CoV-2 ను నిరోధించే సామర్థ్యాన్ని ప్రస్తుత డేటాబేస్‌ల ఆధారంగా డ్రగ్ అభివృద్ధి చేయనున్నారు. రెండవ ట్రాక్‌లో, డేటా అనలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొత్త టూల్స్, అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయనున్నారు.

Read Here>>నియాండర్తల్స్ మానవులలో కరోనా వైరస్ మూలం?