చాక్లెట్స్, బిస్కట్స్ కంటే పేరెంట్స్ బాక్సుల్లో పెట్టే పండ్ల ముక్కలే డేంజర్!!

చాక్లెట్స్, బిస్కట్స్ కంటే పేరెంట్స్ బాక్సుల్లో పెట్టే పండ్ల ముక్కలే డేంజర్!!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఏ పేరెంట్స్ అనుకోరు. కానీ అక్కడే వాళ్లు తప్పులో కాలేస్తున్నారు. చాక్లెట్స్, బిస్కట్లు వంటివి పెడితే షుగర్ కంటెంట్ పెరుగుతుందని.. వాటి బదులు బాక్సుల్లో ఫ్రూట్ స్నాక్స్ పెట్టి పంపించేస్తుంటారు. నిజానికి వాటిలోనే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట.

ఎన్హెచ్ఎస్ కార్డియాలజిస్ట్ డా. అస్సెం మల్హోత్రా షుగర్ పై ప్రచార కార్యక్రమంలో ఈ విధంగా పేర్కొన్నారు. ‘ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎక్కువ మోతాదులో షుగర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. నిజానికి చిన్నపిల్లలకు ఇటువంటి ఆహార పదార్థాలు అందకుండా వాటిని నిషేదించాలి.



సమస్య వీటి నుంచి మాత్రమే కాదు. ఆరోగ్య కరమైన ఆహారాన్ని ప్యాక్ చేసి పిల్లలకు ఇస్తున్న సమయంలో వాటి ద్వారా షుగర్ ఎంత వారి శరీరాలకు చేరుతుందో గమనించడం లేదు. అధిక మోతాదులో తింటే ఇన్సులిన్ లెవల్స్ మారిపోయి ఇట్టే శరీరానికి సమస్యలు మొదలైపోతాయి.

ఇప్పటికీ ఫ్రెష్ స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు అనేవి ఆరోగ్యకరమైన వాటికి మంచి ఆప్షన్. పిల్లల స్నాక్స్ అంటూ మార్కెట్లో దొరికే వాటిని కొనుక్కొచ్చి వారికి అందించి ఫూల్స్ అవ్వొద్దని న్యూట్రిషనిస్ట్ అమాండా ఉర్సెల్ అంటున్నారు. నేరుగా ఫ్రూట్స్ నుంచి వచ్చిన స్నాక్స్ అంటూ.. మార్కెట్లో దొరికే వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు.

మ్యాన్యుఫ్యాక్చర్లు ట్రాఫిక్ లైట్లు లాంటి లేబుల్స్ ను కవర్లపై ఉంచాలి. షుగర్ కంటెంట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్యాకెట్లు రెడ్ కలర్ లైట్లో ఉంటే అలర్ట్ అవగలం. కొన్ని సార్లు అరటిపండు, ఆపిల్ కూడా వాటిల్లో ఉండే ఫైబర్ పూర్తిగా తగ్గిపోయి షుగర్ (గ్లూకోజ్) కంటెంట్ మాత్రమే శరీరానికి అందజేస్తాయి. దానికి కారణం.. ప్యాక్ చేసి ఉంచడమే.