Nutmeg : నొప్పి నివారణకు, చర్మ సౌందర్యానికి జాజికాయ నూనె

జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్., యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకల్లో లేదా కండరాల్లో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది

Nutmeg : నొప్పి నివారణకు, చర్మ సౌందర్యానికి జాజికాయ నూనె

Myristica

Nutmeg : జాజికాయ నూనెను ఔషధాలు, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తుంటారు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి దివ్యఔషదంగా చెప్పవచ్చు.  శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు జాజికాయ బాగా పనిచేస్తుంది. జాజికాయలో ఫైబర్, థియామిన్, విటమిన్ బి 6, ఫోలేట్, కాపర్, మాక్రిగ్రాన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  చిన్న వయసులో వచ్చే డయాబెటిస్ సమస్యలన్నింటికీ జాజికాయ మంచి పరిష్కారం చూపిస్తుంది. జాజికాయ నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకల్లో లేదా కండరాల్లో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది ఇది ఒక రకంగా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. జాజికాయతో నూనె తయారు చేసుకుని వాడితే ఎలాంటి నొప్పులు అయినా సులభంగా తగ్గిపోతాయి. ఒక బాణలిలో నాలుగు స్పూన్ల ఆవనూనె వేసుకోవాలి దానిలో ఒక స్పూన్ జాజికాయపొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి అర స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఈ నూనెను ఒకేసారి ఎక్కువగా తయారుచేసుకుని సీసాలో పోసుకుని నిలువ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు కొంచెం నూనె తీసుకొని వేడి చేసి నొప్పులు ఉన్న భాగంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే ఎలాంటి నొప్పులు అయినా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

జాజికాయ పొడిని హృదయ స్పందన, రక్త ప్రసరణను ఉత్తేజ పరిచేందుకు వినియోగించవచ్చు. ఇది మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కిడ్నీ రాళ్ళు, మూత్రాశయం, మూత్ర మార్గంలో వచ్చేమంటను తగ్గిస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో చిటికెడు జాజికాయ పొడి,చిటికెడు పసుపు కలుపుకొని తాగితే డయబెటిస్, నిద్రలేమి సమస్యలు తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి కూడా పెరుగుతుంది.

జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. మీరు స్నానం చేసేటప్పుడు జాజికాయ నూనెను నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. క్యాన్సర్, నపుంసకత్వాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. అధికంగా వాడటం వల్ల శరీరానికి హాని కలిగిస్తుంది. దీంతోపాటు కంటి సమస్యలు, తలనొప్పి, మైకము, చర్మంపై దద్దుర్లు, నోరు పొడిబారడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. దీనిని తక్కువ మోతాదులోనే వాడాలి.