Apple, Honey, Milk Shake : పోషక విలువలతో కూడిన యాపిల్, హనీ, మిల్క్ షేక్!

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు ప్రోటీన్ యొక్క మంచి వనరులు. పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పాలు తాగడం వలన డోపామైన్ స్రావం పెరుగుతుంది. ఇది మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.

Apple, Honey, Milk Shake : పోషక విలువలతో కూడిన యాపిల్, హనీ, మిల్క్ షేక్!

Apple, Honey, Milk Shake

యాపిల్ పండు, తేనె, పాలు ఈ మూడు శరీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రోజుకొక యాపిల్ తీసుకుంటే వైద్యునితో పని ఉండదని చెబుతుంటారు.

ఇక తేనె విషయానికి వస్తే తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ వివిధ వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది. తేనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, అందువల్ల తేనె గాయాలను నయం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.

పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు ప్రోటీన్ యొక్క మంచి వనరులు. పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పాలు తాగడం వలన డోపామైన్ స్రావం పెరుగుతుంది. ఇది మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. పాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును సరిగ్గా ఉంచుతుంది. పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే యాపిల్, తేనె, పాలు ఈ మూడింటిని మిళితం చేసి తీసుకుంటే ఇక బోలెడన్నీ ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. యాపిల్, తేనె, మిల్క్ షేక్ తయారీ ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

యాపిల్, తేనె, మిల్క్ షేక్ తయారీ ;

దీనికి గాను ముందుగా రెండు యాపిల్స్ తీసుకోవాలి. పాలు రెండు కప్పులు , 6 టీ స్పూనుల తేనె, దాల్చిన చెక్క పొడి చిటికెడు, ఒక కప్పు ఐస్ ముక్కలు తీసుకోవాలి. తరువాత పాలు కాగబెట్టి చల్లార్చుకోవాలి. యాపిల్స్ ను ముక్కలుగా కోసి , మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత పాలు, ఐస్ ముక్కలు, తేనె వేసి బాగా బ్లెండ్ చేయాలి. తరువాత గ్లాసుల్లో పోసి , దాల్చిచెక్క పొడి చల్లి సర్వ్ చేయాలి.