Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!

మొటిమల నివారణకోసం రెండు చెంచాల ఓట్స్ ను నీళ్లలో లేదా పాలలో వేసి ఉడికించాలి. చిక్కని మిశ్రమం అయ్యాక దింపి , కొద్దిగా చల్లారిన తరువాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!

Oatmeal Packs

Oatmeal Packs : ఓట్స్ లో ఉండే అమైనో అమ్లాలు, సిలికా చర్మానికి సహజ మాయిశ్ఛరైజర్ గుణాలను అందిస్తాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరిచి సున్నితంగా ఉంచుతాయి. ముఖానికి కాంతినిచ్చే సహజ ప్యాక్ లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓట్స్ లోని విటమిన్ ఇ చర్మానికి మాయిశ్ఛరైజర్ గుణాలను అందిస్తుంది.

ఓట్స్ తో చర్మానికి ప్యాక్స్ ;

రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో చెంచా తేనె, రెండు స్పూన్ల పాలూ కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొన్ని ఓట్స్ తీసుకుని వాటికి టొమాటో గుజ్జు చేర్చాలి. ఒట్స్ మొత్తబడి చిక్కని పేస్ట్ అయ్యాక ముఖానికి పట్టించి పది నిమిషాలయ్యాక కడిగేస్తే సరిపోతుంది. టొమాటో నలుపు దననాన్ని తొలగించటంలో సహాయపడుతుంది. ఓట్స్ లోని పీచు పదార్ధాలు జిడ్డుని తొలగిస్తాయి.

మొటిమల నివారణకోసం రెండు చెంచాల ఓట్స్ ను నీళ్లలో లేదా పాలలో వేసి ఉడికించాలి. చిక్కని మిశ్రమం అయ్యాక దింపి , కొద్దిగా చల్లారిన తరువాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. పావుగంట తరువాత గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

రెండు స్పూన్ల ఓట్స్ లో సగం నిమ్మకాయ రసం, స్పూన్ ఆలివ్ నూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం , ఓట్స్ మిశ్రమం చర్మంలోని జిడ్డు తొలగించేందుకు సాయపడతాయి. ఆలివ్ నూనె చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.