Oats : నీరసాన్ని పోగోట్టే ఓట్స్..

రక్తంలో చక్కెర స్ధాయిలను స్ధిరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు కాంప్లెక్స్ కార్పోహైడ్రేట్లు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓట్స్ ను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు

Oats : నీరసాన్ని పోగోట్టే ఓట్స్..

Oats

Oats : మనిషి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఓట్స్ కలిగి ఉంటాయి. 19 శతాబ్దంలో ఓట్స్ పై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీని పోషక విలువల గురించి తెలుసుకున్న ప్రజలు ఓట్స్‌ను తమ ఆహరంలో భాగం చేసుకోవడం మొదలుపెట్టారు. దీనిలో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా ఎక్కువే. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి.

ప్రొటీన్లు, పీచు ఎక్కవగా కలిగిన ఓట్స్ తినటం వల్ల నీరసం అనేది ఉండదు. త్వరగా తయారు చేసుకునే ఆహారంలో ఓట్స్ మీలు ఒకటి. అంతేకాదు ఓట్స్ లో ఉండే పీచు, ప్రొటీను కడుపు నిండిన బావనకలిగించి ఎక్కవ సమయం పాటు ఆకలి కలగకుండా చేస్తాయి. సాధారణంగా ఉదయం పూట ఓట్స్ తీసుకోవటం వల్ల మధ్యాహ్నం భోజన సమయం వరకు కడుపు నిండిన బావన కలుగుతుంది. ఇలా కలగటంతో మధ్యలో ఇతర ఆహారాలను తినాలన్న కోరిక కలుగదు.

రక్తంలో చక్కెర స్ధాయిలను స్ధిరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు కాంప్లెక్స్ కార్పోహైడ్రేట్లు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓట్స్ ను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. వండే అవసరంల లేకుండానే ఉదయం సమయంలో తీసుకోవచ్చు. ఓట్స్ లో ఉండే ఫౌబర్ బెలా గ్లూకాన్ , చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు దరి చేరకుండా కాపాడుతుంది.

కేన్సర్ నుండి రక్షణ కల్పించటం తోపాటు జీర్ణ వ్యవస్ధ తీరును మెరుగు పరచటంలో ఓట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో గ్లూకోజ్ ఇన్సులిన్ లను సక్రమంగా వినియోగించుకోవటంలో దోహదం చేస్తుంది. దీని వల్ల షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం కేవలం 40 గ్రాముల ఓట్స్లో ఉంటుంది. మెగ్నీషియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. రక్తనాళాలు కుచించుకు పోవడాన్ని అది ఆపుతుంది. ఇందులో ఉండే గ్లూటెన్ వల్ల శరీరానికి ఎలాంటి హానికలగదు అని తేలింది.