Covid Vaccine: ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒక్క డోసైనా చాలు

విడ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ చాలు ప్రాణాలు కాపాడుకోవడానికి అని చెప్తుంది ఈ స్టడీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ.

Covid Vaccine: ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒక్క డోసైనా చాలు

Covid Vaccine

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ చాలు ప్రాణాలు కాపాడుకోవడానికి అని చెప్తుంది ఈ స్టడీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ. జూన్ 21న పబ్లిష్ అయిన ఈ విశ్లేషణలో.. ఇండియాలోని తమిళనాడులో ఒక్క కొవిడ్ డోస్ తోనే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని అందులో పేర్కొంది. ఈ స్టడీ మొత్తం లక్షా 17వేల 524మంది పోలీసులపై నిర్వహించారట.

కొవిడ్ నుంచి చావు వరకూ తీసుకెళ్లకుండా ఫస్ట్ డోస్ అయితే 82శాతం రెండో డోసు కూడా పూర్తి అయితే 95శాతం ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఏ రకమనేది పక్కకు ఉంచితే కరోనావైరస్ సింగిల్ షాట్ తీసుకున్న వాళ్లలో చావు రేటు చాలా తక్కువగా ఉంది.

విశ్లేషణ ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి మే 14వరకూ 32వేల 792మందికి సింగిల్ డోస్ కొవిడ్ వ్యాక్సిన్ అందింది. 67వేల 673మందికి రెండు డోసులు అందాయి. ఆ సమయంలో 17వేల 59మంది అస్సలు వ్యాక్సిన్ వేయించుకోలేదు.

ఈ సమయంలో 13ఏప్రిల్ నుంచి 14మే వరకూ 31కొవిడ్ మృతులు సంభవించాయి. ఆ చనిపోయిన వారిలో నలుగురు రెండు డోసులు తీసుకున్న వారు, ఏడుగురు ఒక్క డోస్ మాత్రమే తీసుకున్న వారు, 20 మంది అస్సలు వ్యాక్సిన్ వేసుకోని వారు ఉన్నారని స్టడీ వెల్లడించింది.

ఈ స్టడీ కంక్లూజన్ లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు 0.06 శాతం, ఒక డోస్ తీసుకున్న వారు 0.21శాతం, రెండు డోసులు తీసుకున్న వారు 1.17శాతం చనిపోయినట్లు తెలిసింది. రీసెర్చ్ చేసిన నిపుణులు.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా బంధువుల ద్వారానే జరుగుతున్నట్లు గుర్తించారు.