Covid Symptoms : కరోనా బాధితుల్లో ముగ్గురిలో ఒకరికి కనీసం ఒక దీర్ఘకాలిక లక్షణం ఉంటోంది!

ముగ్గురు COVID-19 బాధితుల్లో ఒకరు కరోనావైరస్ సోకిన తర్వాత 6 నెలల వ్యవధిలో కనీసం ఒక దీర్ఘ-కోవిడ్ లక్షణాన్ని కలిగి ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.

Covid Symptoms : కరోనా బాధితుల్లో ముగ్గురిలో ఒకరికి కనీసం ఒక దీర్ఘకాలిక లక్షణం ఉంటోంది!

One In Three Covid 19 Patients Get At Least One Long Covid Symptom

One long-Covid symptom : కరోనావైరస్ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కరోనా కేసులు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా బారినపడివారిలో కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక లక్షణాలు బాధిస్తున్నాయి. కరోనా సోకిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో కనీసం ఒ దీర్ఘ కాలిక కోవిడ్ లక్షణంతో బాధపడుతున్నారని యూకేలో కొత్త అధ్యయనం తెలిపింది. దాదాపు 37శాతం లేదా ముగ్గురు COVID-19 బాధితుల్లో ఒకరు కరోనావైరస్ సోకిన తర్వాత 6 నెలల వ్యవధిలో కనీసం ఒక దీర్ఘ-కోవిడ్ లక్షణాన్ని కలిగి ఉన్నట్టు తేలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ (NIHR), పరిశోధన ఆక్స్‌ఫర్డ్ హెల్త్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ (BRC) అమెరికా ఆధారిత ట్రైనెట్ఎక్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ నుంచి డేటాను సేకరించింది.
Covid-19 : ఈ 5 లక్షణాలు ఉంటే.. కరోనా సోకినట్టే!

ఈ డేటా ద్వారా కరోనా నుంచి కోలుకుంటున్న 270,000 మందికి పైగా దీర్ఘ-కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారని వెల్లడించింది. అత్యంత సాధారణ దీర్ఘ-కోవిడ్ లక్షణాల్లో శ్వాస సమస్యలు, పొత్తికడుపు లక్షణాలు, అలసట, నొప్పి ఆందోళన, ఒత్తిడి వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరోనా సోకిన తర్వాత ఆరు నెలల్లో అన్ని వయసుల వ్యక్తుల్లో గణనీయమైన నిష్పత్తిలో కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన NIHR అకడమిక్ క్లినికల్ ఫెలో డాక్టర్ మాక్స్ టాక్వెట్ స్పందించారు. కరోనా లక్షణాలతో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారని నిర్ధారిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. ప్రస్తుత భవిష్యత్తు క్లినికల్ అవసరాలను తీర్చడానికి తమ వద్ద కాన్ఫిగర్ సేవలు అవసరమని టాక్వెట్ చెప్పారు. కరోనా సోకిన తర్వాత మొత్తం 1 నుంచి -180 రోజుల వ్యవధిలో వైరస్ సంబంధిత దీర్ఘకాలిక లక్షణాలు అధిక రేట్లు ఉన్నాయని గుర్తించారు. వైరస్ తీవ్రత, వయస్సు, లింగం, దీర్ఘ-కోవిడ్ లక్షణాలను ప్రభావితం చేసిందని వైద్యులు తెలిపారు.

మహిళల్లో ఈ లక్షణాలు కొంచెం ఎక్కువ :
ఆస్పత్రిలో చేరినవారిలో దీర్ఘ-కోవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, అందులో మహిళల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు. వృద్ధులు, పురుషులు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు, మానసిక సమస్యలను కలిగి ఉంటారని పరిశోధకులు అధ్యయనంలో రుజువైంది. అయితే యువకులు, మహిళల్లో ఎక్కువగా తలనొప్పి, ఉదర లక్షణాలు, ఆందోళన/డిప్రెషన్ కలిగి ఉన్నట్టు తెలిపారు. చాలా మంది కరోనా బాధితులకు ఒకటి కంటే ఎక్కువ దీర్ఘ-కోవిడ్ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. అది కూడా సమయం పెరిగే కొద్దీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కరోనా (Covid-19) బారినుంచి పూర్తిగా కోలుకోలేని వారిపై వివిధ రకాల పరిశోధనలు అత్యవసరమని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయన ప్రొఫెసర్ పాల్ హారిసన్ అన్నారు. కరోనా వ్యాప్తికి కారణమయ్యే విభిన్న లక్షణాలకు సంబంధించిన మెకానిజమ్‌లను గుర్తించాల్సిన అవసరం ఉంది. కొవిడ్-19 దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలను నివారించాలన్నా, సమర్థవంతంగా చికిత్స చేయాలంటే ఈ డేటా చాలా అవసరమని చెప్పారు.

తొమ్మిది కోర్ లాంగ్-కోవిడ్ లక్షణాలు..  1.5 రెట్లు ఎక్కువ :
ఇన్ఫ్లుఎంజా లేదా ఫ్లూ నుంచి కోలుకుంటున్న వ్యక్తులలో కూడా ఇదే తరహా లక్షణాలు ఉన్నాయని ఇన్ఫ్లుఎంజా తర్వాత లాంగ్-కోవిడ్ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. కొవిడ్ -19 తర్వాత 1.5 రెట్లు ఎక్కువగా కనిపించినట్టు అధ్యయనం తెలిపింది. కొవిడ్-19 నిర్ధారణ అయిన 90-180 రోజుల తర్వాత తొమ్మిది కోర్ లాంగ్-కోవిడ్ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. అందులో అసాధారణ శ్వాస (8శాతం), ఉదర లక్షణాలు (8శాతం), ఆందోళన/డిప్రెషన్ (15శాతం), ఛాతీ/గొంతు నొప్పి (6శాతం), మతిమరుపు సమస్యలు లేదా బ్రెయిన్ ఫాగ్ సమస్యలు (4శాతం), అలసట (6శాతం), తలనొప్పి (5శాతం), మైయాల్జియా లేదా కండరాల నొప్పి (1.5శాతం), ఇతర నొప్పులు (7శాతం), మొత్తంగా లక్షణాలు (37శాతం) వరకు ఉంటాయని యూకే కొత్త అధ్యయనం నివేదించింది. అయితే ఈ దీర్ఘ-కోవిడ్ లక్షణాలకు కారణాలేమిటో, ఎంత తీవ్రంగా ఉంటాయి? ఎంతకాలం ఉంటాయో అధ్యయనం వివరించలేదు.
SCR : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు